తెలంగాణ

సిద్దిపేట
సిద్దిపేట

2014 సాధారణ ఎన్నికలలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మూడు ఉప ఎన్నికలలో గెల్చిన ఏకైక నేతగా రికార్డు సాధించిన హరీష్ రావు ఆరేళ్లలో మూడు ఉప ఎన్నికలు, ఒక సాధారణ ఎన్నికలో గెలుపొంది మరో రికార్డు సాధించారు. ఈసారి ఎన్నికల్లో సైతం 93928 ఓట్ల ఆధిక్యతతో తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి టి.శ్రీనివాస్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే అవడానికి ముందుగానే మంత్రి పదవిని వైఎస్ క్యాబినెట్ లో నిర్వహించిన హరీష్ రావు, ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావంతో కేసిఆర్ కేబినెట్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 
కేసిఆర్ సిద్దిపేటలో ఆరుసార్లు, గజ్వేల్ లో ఒకసారి మొత్తం ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతగా రికార్డు పొందారు. ఈ ఘనత తెలంగాణలో ప్రస్తుతం కేసిఆర్, కాంగ్రెస్ నేత జానారెడ్డి, గతంలో యతిరాజారావులు సాధించారు. 
కేసిఆర్ కు ముందు మరో తెలంగాణ నేత మదన్ మోహన్ కూడా సిద్దిపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెల్చారు. 1970లో జరిగిన ఉప ఎన్నికలో మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి తరపును ఇండిపెండెంటుగా పోటీ చేసి గెల్చారు.  ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ లో కలిసిపోయారు.


ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ,మంత్రి హరీష్ రావును రంగంలోకి దింపింది టిఆర్ఎస్ 

Activities are not Found
No results found.