తెలంగాణ

వనపర్తి
వనపర్తి

2014 సాధారణ ఎన్నికలో వనపర్తి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి విజయం సాధించారు. ఈసారి ఆయన తన సమీప టిఆర్ఎస్ ప్రత్యర్ధి నిరంజన్ రెడ్డిపై 4291 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఓటమి చెందారు. 45200 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితమవ్వాల్సి వచ్చింది. 
చిన్నారెడ్డి 1989, 99, 2004, 2014లలో గెలుపొందారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994లోను తిరిగి 2009లో గెలిచారు. 
వనపర్తికి 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి పదిసార్లు, టిడిపి నాలుగుసార్లు, పిఎస్పీ ఒకసారి గెలుపొందాయి. 1957లో వనపర్తిలో పద్మనాభరెడ్డి ఏకగ్రీవంగా గెలుపొందారు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 1952లో ఇక్కడ నుంచే గెలుపొందారు. టిడిపి నేత డాక్టర్ ఎ. బాలకృష్ణయ్య రెండుసార్లు గెలిస్తే... జె.కుముదినిదేవి రెండుమార్లు గెలుపొందారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి 1994లో ఛీప్ విప్ గా పని చేయగా , 2002 లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. చిన్నారెడ్డి ఉమ్మడిరాష్ట్రంలో వైఎస్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. 

Activities are not Found
No results found.