ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

కడప
కడప

2014 సాధారణ ఎన్నికలలో కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి వైఎస్.అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఆర్.శ్రీనివాసరెడ్డిపై 190323 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు 671983 ఓట్లు రాగా, శ్రీనివాసరెడ్డికి 481660 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వి.అజయ్ కుమార్ కు 14319 ఓట్ల మాత్రమే రావడంతో డిపాజిట్ కోల్పోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోను అధిక్యత వచ్చింది. బద్వేలులో 18099, కడపలో 42508, పులివెందులలో 72483, కమలాపురంలో 11461, జమ్మలమడుగులో 16328, ప్రొద్దుటూరులో 12516, మైదుకూరులో 15591 ఓట్ల మెజార్టీ లభించింది. అవినాశ్ రెడ్డి పార్టీ అధినేత జగన్ కు వరుసకు సోదరుడు. 
కడప లోక్ సభ నియోజకవర్గానికి 17సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, సిపిఐ నాలుగుసార్లు, టిడిపి ఒకసారి, వైసిపి రెండుసార్లు గెలుపొందాయి. సిపిఐ నేత వై.ఈశ్వరరెడ్డి నాలుగుసార్లు గెలిచారు. కాంగ్రెస్ నేత కందుల ఓబుల్ రెడ్డి రెండుసార్లు, డి.ఎస్.రెడ్డి ఒకసారి గెలుపొందారు.  1989 నుంచి వైఎస్ కుటుంబం గెలుస్తూ వస్తుంది.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి లోక్ సభకు నాలుగుసార్లు, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి రెండుసార్లు, రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ రెండుసార్లు గెలిచారు. 2009లో సిఎం హోదాలో ఉంటూ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జగన్ కాంగ్రెస్ పార్టీని , పదవికి గుడ్ బై చెప్పారు. సొంతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. జగన్ 545671 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 

Activities are not Found
No results found.