వనిత టీవీకి అవార్డుల కమిటీ ప్రత్యేక ప్రశంస

మీడియాలో ఉత్తమ విలువలను ప్రదర్శించిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నంది అవార్డులను ప్రకటించింది. 2014 నుండి 2016 వరకు వివిధ కేటగిరీల అవార్డుల వివరాలను కమిటీ ఛైర్మన్‌ అంబికా కృష్ణ  ఇవాళ అమరావతిలో వెల్లడించారు.  ఎన్టీవీ, వనిత టీవీ, భక్తి టీవీ ఛానల్స్‌ ఏకంగా 13 అవార్డులు  గెల్చుకుని రికార్డు సృష్టించాయి. వనిత టీవీ అత్యధికంగా ఎనిమిది అవార్డులను చేజిక్కించుకుంది.  భక్తి టీవీకి మూడు, ఎన్టీవీకి రెండు అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ వనిత టీవీని ప్రత్యేకంగా ప్రశంసించింది.