బెంగుళూరులో తెలుగు సంఘాల మధ్య గొడవ

కర్ణాటకలో ఈ నెల 12న అసెంబ్లీ ఎన్నికలు జరనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారంలో భాగంగా అక్కడి తెలుగు సంఘాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ విభేదాలతో అక్కడి తెలుగు సంఘాలు రెండుగా చీలిపోయారు. కర్ణాటకలోని మొత్తం తెలుగు సంఘాలు బెంగళూరులోని సదరన్ హోటల్‌లో సమావేశమయ్యాయి. ఎవరికీ మద్దతు పలకాలన్న అంశంతో చర్చ జరుగుతుండగా.. తాము మాట్లాడుతామంటూ కొందరు వచ్చారు. అయితే అప్పటికే హాలు నిండిపోవడంతో అనుమతించలేదు. దీంతో వాళ్ళు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రితంగా మారడంతో పోలీసులు అందరిని హోటల్ నుండి పంపించేశారు.