నా పేరు సూర్య..థ్యాంక్యూ ఇండియా మీట్ లైవ్

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" చిత్రం గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశ భక్తి, ఆర్మీ ప్రధానాంశాలతో రూపొందింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ను చేశారు. సినిమాలో ఉన్న బలమైన కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా మెప్పించింది. యాంగ్రీ మెన్ గా బన్నీ కనిపించి..మెచూర్డ్ నటనను కనబర్చాడు. వక్కంతం వంశీకి దర్శకుడిగా మొదటి సినిమానే అయినప్పటికీ బాగా తీశాడనే పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను అందుకున్నాడు. ఇక సినిమా విజయం సాధించిన సంధర్భంగా థాంక్స్ టూ ఇండియా మీట్ పేరుతో ఓ ఈవెంట్ ను చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానుండడంతో అందరి కళ్ళు ఈ వేడుకపైనే పడ్డాయి. ఈ థాంక్స్ టూ ఇండియా మీట్ ను ఈ లింక్ ద్వారా లైవ్ చూడగలరు.