కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం...

కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన పరిణామాలపై మీడియాతో స్పందించిన జగన్... గత నాలుగేళ్లుగా తాము చెబుతూ వస్తున్న విషయాలనే ఇప్పుడు టీడీపీ ఎంపీలు సభలో ప్రస్తావించారన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచించాలని... సీఎం చంద్రబాబు తీరుకు నిరసనగా... కేద్ర వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీన తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జగన్... ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి..