బీజేపీతో జగన్ జతకట్టారనడం కరెక్ట్ కాదు..!

బీజేపీతో వైసీపీ అధినేత జగన్ చేతులు కలిపారంటూ వస్తున్న విమర్శలపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఇలాంటి విమర్శలు ఎంత వరకు సమంజసమని అని కూడా ఆమె ప్రశ్నించారు. ఒకవేళ మోడీతో జతకడితే… కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎందుకిస్తామని ఆమె వెల్లడించారు.

కాగా ఇంకా ఆమె మాట్లాడుతూ… మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టీడీపీ నేతలు మంచోడు అని అన్నారని… ఇప్పుడు టీడీపీ నేతలను ప్రశ్నించేసరికి ఆయన చెడ్డ వ్యక్తి అయ్యారా? అంటూ దుయ్యబట్టారు. ఆర్థిక నేరస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేషేనని… జగన్ కాదని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ఇంకా రోజా ఏం మాట్లాడారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.