పాక్‌లో బాణసంచా కాల్చుకోండి, నేను మీకు సహాయం చేస్తా: గంభీర్‌

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఓడిపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతుంటే, మరోవైపు కశ్మీర్‌లోని వేర్పాటువాదులు మాత్రం సంబరాలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హరియత్‌ నాయకుడు మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌కు.., “అంతటా టపాసులు కాల్చండి. ఈద్‌ పండుగ ముందుగానే వచ్చింది. ఉత్తమ క్రికెట్‌ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్‌ టీమ్‌కు అభినందనలు” అంటూ ట్వీట్‌ చేశారు.

దీనికి ఇండియన్‌ క్రికెటర్‌ గంభీర్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. “మిర్వాయిజ్‌ మీరు ఎందుకు సరిహద్దు దాటి వెళ్లకూడదు? చైనా బాంణాసంచా అయితే పేల్చడానికి బాగుంటుంది. రంజాన్‌ అక్కడ సెలబ్రేట్‌ చేసుకోండి. ప్యాకింగ్‌లో నేను మీకు సహాయం చేస్తానని” ట్వీట్‌ చేశాడు. దీనిపై టీమిండియా ఫ్యాన్స్‌ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టును మిర్వాయిజ్‌ అభినందించగడం ఇదే మొదటిసారి కాదు. చాంపియన్స్‌ ట్రోఫీ మొదటి సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ గెలిచినప్పుడు కూడా ఇదేవిధంగా ఆయన స్పందించారు. ఫైనల్లో భారత్‌పై పాక్‌ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.