కర్ణాటక ఎన్నికల ఫలితాలు 2018

                        

 • బీజేపీ ప్రలోభాలు ఆగలేదు: కుమారస్వామి
  కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ఇప్పటికీ ప్రయత్నిస్తోంది. కానీ వారి ప్రయత్నం ఫలించదు. 
 •  
 • యడ్యూరప్పకు ఆహ్వానం

         ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ నేత యడ్యూరప్పకు ఆహ్వానం
         బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్‌
         రేపు ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల మధ్య ప్రమాణ స్వీకారం
        రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకారం
        రేపు కేవలం యడ్యూరప్ప మాత్రమే ప్రమాణం
        బల నిరూపణ తరవాత మంత్రి వర్గ విస్తరణ

 

 • ఎమ్మెల్యేల తరలింపు

            కాంగ్రెస్‌ పార్టీ తన ఎమ్మెల్యేలను ఈగల్‌టన్‌ రిసార్ట్‌కు తరలించింది.

 

 • ఏ క్షణమైనా.. ఆహ్వానం

          గవర్నర్‌కు చేరిన 222 మంది ఎమ్మెల్యేల జాబితా
         రాత్రి 8కల్లా యడ్యూరప్పకు రాజ్‌భవన్‌ ఆహ్వానం
         రేపు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు

 

 • కాస్సేపట్లో గవర్నర్‌తో యడ్యూరప్ప భేటీ

         సాయంత్రం ఆరు గంటలకు బీజేపీ నేత యడ్యూరప్ప గవర్నర్‌ వజుబాయ్‌తో భేటీ కానున్నారు. 

        ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా యడ్యూప్పను ఆహ్వానించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

.

 • బీజేపీ ఎంపీల ఫోన్లు ట్యాప్‌?

         తమ ఫోన్లను రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందని బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ట్యాప్‌ ఆరోపిస్తున్నారు. 
        ఈ మేరకు వీరు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు విడిగా లేఖలు రాశారు. 
       స్పీకర్‌కు లేఖ రాసిన ఎంపీల్లో శోభ కరంద్లాజ్‌, పీపీ మోహన్‌, జీఎం సిద్ధేశ్వర ఉన్నారు. 

 • ముగిసిన భేటీ 

           గవర్నర్‌తో ముగిపిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతల భేటీ
           ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన బృందం
           గవర్నర్‌ వైఖరిని బట్టి భవిష్యత్‌ కార్యాచరణ 

 

 • హార్స్‌ ట్రేడింగ్‌ ఓ ఆర్ట్‌...!

 

 • నేను సాధువును కాను...

            తమ ఎమ్మెల్యేల కోసం బీజేపీ గాలం వేయడంపై జేడీఎస్‌ నేత కుమారస్వామి తీవ్ర స్థాయిలో స్పందించారు. 'నేను సాధువును కాను., మీ ఎమ్మెల్యేలకూ గాలం  వేయగలన'ని బీజేపీకి కుమారస్వామి హెచ్చరించారు.

 • నాకు కూడా ఆఫర్‌ ఇచ్చారు

            నిన్న రాత్రి నుంచి మా ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్‌లో ఉంది. వారిలో కొందరికి రూ.100 కోట్లు ఆఫర్‌ చేసింది, బీజేపీ నాకు కూడా ఆఫర్‌ చేపింది. కాని నేను తిరస్కరించాను.     - జేడీఎస్‌ నేత కుమార స్వామి

 •    సాయంత్రం 5  గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్న జేడీఎస్‌ నేత కుమారస్వామి

           లేదంటే...

           కాస్సేపట్లో రాజ్ భవన్‌కు కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు
          ప్రత్యేక బస్సుల్లో రాజ్‌ భవన్‌ వెళుతున్న ఎమ్మెల్యేలు
          గవర్నర్‌ ఎదుట రెండు పార్టీల ఎమ్మెల్యేల పరేడ్‌
          ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనున్న ఎమ్మెల్యేలు
          లేదంటే ధర్నాకు దిగాలనే యోచనలో కాంగ్రెస్‌, జేడీఎస్‌
 

 • మేము ఎవరికీ డబ్బులు ఆఫర్ చెయ్యట్లేదు - బీజేపీ కేంద్ర మంత్రి జవదేకర్ 
 • బీజేపీని వెంటాడుతున్న పాత ట్వీట్లు
 • రేపు 12.20 కి యడ్యూరప్ప ప్రమాణా స్వీకారం

  విధాన సౌధ పూర్వ ద్వారా వద్ద స్వీకార కార్యక్రమం

 • పదవులను దుర్వినియోగం చేస్తున్నారు: కుమారస్వామి
  80 ఏళ్ల దేశ చరిత్రలో బీజేపీ చేసినట్టుగా రాజ్యాంగబద్ధమైన పదవులను మరే పార్టీ కూడా దుర్వినియోగం చేయలేదు. అమిత్‌ షా తదితర నేతలు 'హార్స్‌ ట్రేడింగ్‌'ను ప్రోత్సహిస్తున్నారా లేక రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా?.
  జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లతోపాటు మంత్రి పదవులు ఆశచూపి తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నం.
  సెక్యులర్ ఓట్ల చీలిక బీజేపీకి కలిసి వచ్చింది. మోడీ గొప్పదనం లేదు. బీజేపీ గెలుపు మోడీ గెలుపు కాదు.
 • శోభా డే చెణుకు

      ఇదేం ప్రజాస్వామ్యం? కీలక నిర్ణయాలను చెంచా గవర్నర్‌లకు వొదిలేయడం న్యాయమా?  అంటూ ట్వీట్‌ చేశారు ప్రముఖ రచయిత్రి, కాలమిస్ట్‌

 • మా కుటుంబంలో చీలక లేదు: కుమారస్వామి సోదరుడు రేవణ్ణ
  కుమారస్వామితో కలిసి మీడియా ముందుకు వచ్చిన రేవణ్ణ. తామంతా ఒకటేనని ప్రకటన. జేడీఎస్‌లో చీలక ప్రశ్నే లేదని స్పష్టీకరణ

 • గవర్నర్‌ను కలిసిన యెడ్డీ.. 

 • గవర్నర్‌ను కలిశాం. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరాం. అన్ని అంశాలూ పరిశీలించాక సరైన సమయంలో నిర్ణయిస్తామని గవర్నర్‌ చెప్పారు.. యడ్యూరప్ప

 • కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా.
 • జేడీఎస్‌ శాసనసభా పక్ష సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు గైర్హాజరు.
 • బీజేపీ శానసభ పక్ష నేతగా యడ్డ్యూరప్ప ఏకగ్రీవ ఎన్నిక. 
 • కాంగ్రెస్ కు జై కొడుతున్న రెబల్ 
 • I got a call from the BJP leaders. They said come to us & we'll give a ministry to you. But, I'm going to stay here. HD Kumaraswamy is our CM: ALP Bayyapur, Congress MLA. 
 • స్వామియే శరణం...

  కుమారస్వామికి సీఎం పీఠం ఇచ్చేందుకు బీజేపీ రెడీ. జేడీఎస్‌తో చర్చలు ప్రారంభించిన బీజేపీ.

 • ఇక్కడ ఏం చేస్తారో 
 • ఈ కాంబినేషన్‌తో మోడీకి మూడుతుంది!  (ప్రత్యేక వ్యాసం) 
 • బీజేపీ నైతిక విలువలకు కట్టుబడాలి

  ఇప్పటికే ఎన్నికల్లో భారీ ఎత్తున అవినీతిని చూశామని ప్రముఖ పారిశ్రామికవేత్త బయోకాన్‌ కంపెని యజమాని కిరణ్‌ మజుందార్‌ అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని తాజా పరిస్థితిపై ఆమె కామెంట్‌ చేస్తూ... మరింత అవినీతికి ఆస్కారం లేకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా బీజేపీ చూడాలని ఆమె ట్వీట్‌ చేశారు.

 •  

 • కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం ప్రారంభం. సమావేశం తరవాత ఎమ్మెల్యేలకు రిసార్ట్‌కు తరలించే అవకాశం. రాష్ట్ర అధ్యక్షుడు పరమేశ్వరతో పాటు ఇతర నేతలు సమావేశానికి చేరుకున్నారు. 
 • కర్నాటక టుడే

        బెంగుళూరు కి కేంద్ర మంత్రులు జవదేకర్,నడ్డా

          నేడు పదిన్నరకు బీజేపి శాసన సభ్యుల‌సమావేశం..

         ఎల్పీ నేతను ఎన్నుకొన్న తర్వాత పరేడ్ గా రాజ్ భవన్ కి వెల్లనున్న బీజేపి ఎమ్మెల్యే లు.

          అతి పెద్ద పార్టీ గా బీజేపి అవతరించినందున తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేకి అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరనున్న బీజేపి.

 • బీజేపీది సాంకేతిక విజయం మాత్రమే: కాల్వ శ్రీనివాసులు, మంత్రి
  మోడీ నియంతృత్వ విధానాల పట్ల కర్ణాటక ప్రజలు విసిగిపోయారు.
  బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీజేపీయేతర పార్టీలు విఫలం అయ్యాయి.
  బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 36 శాతం మాత్రమే.
  ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఓట్ల శాతం పెరగలేదు.
  రాజకీయాల్లో ఓట్లు తక్కువగా వచ్చినా.. సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో అదే జరిగింది.
  2019లోనూ ఇదే రిపీట్ అవుతుందని బీజేపీ అనుకుంటే పొరపాటే.
  మాకున్న సమాచారం మేరకు తెలుగువాళ్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు.

 • రెడ్ల గెలుపోటములు..
  మొత్తం ఏడుగరు 'రెడ్లు' పోటీచేశారు. సోమశేఖరరెడ్డి, జనార్దనరెడ్డి, శ్రీరాములు గెలిచారు. మిగతా నలుగురు ఓడారు.
   
 •  కర్నాటకలో బీజేపీకి తెలుగోడి దెబ్బ..!

  ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఘోరంగా ఓడిన బీజేపీ

  ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న కర్నాటక జిల్లాలు – 5
  5 జిల్లాల్లోని మొత్తం నియోజకవర్గాలు – 32
  32 నియోజకవర్గాల్లో బీజేపీకి వచ్చిన సీట్లు – 8 మాత్రమే

  రాయచూర్ జిల్లాలో మొత్తం సీట్లు – 7, బీజేపీకి వచ్చినవి – 2
  బళ్లారిలో మొత్తం సీట్లు -9, బీజేపీకి వచ్చినవి – 3
  కోలార్ లోని మొత్తం సీట్లు – 6, బీజేపీకి వచ్చినవి – 0
  కొప్పల్ జిల్లాలో మొత్తం సీట్లు -5, బీజేపీకి వచ్చినవి – 3
  చిక్కబళ్లాపురలో మొత్తం సీట్లు -5, బీజేపీకి వచ్చినవి - 0

 • ఏ పార్టీకీ మెజారిటీ రాకుంటే.. 
 • బీజేపీ.. సగం సీట్లనూ గెలవలేకపోయింది: ప్రకాష్‌రాజ్‌
 • ఇది మన ప్రజాస్వామ్యం!
  ఓట్లు ఎక్కువ.. సీట్లు తక్కువ...

 • చాముండేశ్వరిలో పరువు పోగొట్టుకున్న సిద్ధరామయ్య

 • బాదామిలో అతి కష్టంపై గెలిచిన సిద్ధరామయ్య. జేడీఎస్‌ అభ్యర్థికి 24వేల ఓట్లు పడ్డాయి. సిద్ధూకు వచ్చిన మెజారిటీ 1600 ఓట్లు

 • స్వల్ప తేడాతో..
  బాదామీలో 1696 ఓట్లతో సిద్ధరామయ్య ఓటమి. 
  హిరేకేరూరులో బీజేపీ అభ్యర్థి విజ్ఞేశ్వర్‌ బానేకర్‌పై 555 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి  బసవన్న గౌడ పాటిల్‌ విజయం.
  శృంగేరిలో బీజేపీ అభ్యర్తి జీవారాజ్‌పై  1981 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేగౌడ్‌ విజయం.
  ఎల్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి పాటిల్‌పై 1483 తేడాతో ఓట్లతో కాంగ్రెస్‌ అభ్యర్థి శివరామ్‌ విజయం.
  మంకాన్‌మార్డ్‌లో బీజేపీ అభ్యర్థి వల్లభపై 2850 ఓట్ల తేడాతో సతీష్‌ విజయం.
  అలంద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాటిల్‌పై 692 ఓట్లతో బీజేపీ అభ్యర్థి సుభాష్‌ గెలుపు.
  సిద్ధనూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి హంపన్నగౌడ్‌పై 1597 ఓట్లతో జేడీఎస్‌ అభ్యర్థి వెంకట్రావ్‌గౌడ్‌ గెలుపు.

   

 • బళ్ళారి నుంచి గాలి జనార్ధనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖరరెడ్డి సుమారు 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

 • ఉత్కంఠ రేపిన 15 స్థానాలు..

 

 • శ్రీరాములు పదవికి ఎసరు?
  ఆపరేషన్‌ కమల పేరుతో కాంగ్రెస్‌ లేదా జేడీఎస్‌ నుంచి నేతలను తేవాలని బీజేపీ నిర్ణయించడంతో శ్రీరాములుకు ఇస్తామన్న డిప్యూటీ సీఎం పదవికి ఎసరు తగలనుంది. శ్రీరాములను ఇప్పటికే బెంగళూరుకు రప్పించిన యడ్యూరప్ప శ్రీరాములతో మంతనాలు ప్రారంభించారు. పార్టీ మారేవారికి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్‌ చేస్తుండటంతో మరో మంచి పదవి ఇస్తామని హామి ఇస్తున్నారు. మరి శ్రీరాములు ఎలా స్పందిస్తారో... 

 • ఆపరేషన్‌ కమల ప్రారంభం
  కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు బీజేపీ గాలం. సిద్ధరామయ్యతో తీవ్ర విభేదాలున్న శివకుమార్‌..తనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలను తెస్తారనే నమ్మకం బీజేపీ నేతల్లో ఉంది.
 • జేడీఎస్‌ లెజిస్లేటరీ పార్టీ నేతగా కుమారస్వామి గౌడ ఏకగ్రీవ ఎన్నిక
 • మోడీ ధన్యవాదాలు

  బీజేపీ అభివృద్ధి అజెండాకు మద్దతు పలికినందుకు కర్ణాటక సోదర సోదరీమణకులకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీగా అవతరించడంలో కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

 • వారం రోజుల్లోగా కర్ణాటక అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.
 • కుమారస్వామితోపాటు గవర్నర్‌ను కలిసిన సిద్ధరామయ్య, ఆజాద్‌, ఖర్గే.

 • గవర్నర్‌ను కలిసిన యడ్యూరప్ప. బలనిరూపణకు వారం రోజులు గడువు అడిగిన యెడ్డీ. రెండు రోజుల్లో నిర్ణయం చెబుతానన్న గవర్నర్
 • అపాయింట్‌మెంట్‌ ఇవ్వండి

ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీకి కాంగ్రెస్‌ ఇస్తున్న మద్దతు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్టు కుమారస్వామిగౌడ చెప్పారు. ఈమేరకు చర్చించేందుకు సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు. 


 

 • కాంగ్రెస్‌కు నైతిక హక్కు లేదు: యడ్యూరప్ప
  సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా గవర్నర్‌ తొలుత మమ్మల్నే పిలవాలి.
  అతిపెద్ద పార్టీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలి.
  మార్పు కోరుతూ ప్రజలు తీర్పిచ్చారు.
  ప్రజాతీర్పును కాలరాసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. 
  అధికారం కోసం కాంగ్రెస్‌ చేస్తున్న కుట్రల్ని ఖండిస్తున్నాం.
  ప్రజలు తిరస్కరించినా అధికారం కోసం కాంగ్రెస్‌ పాకులాడుతోంది.

 • కాంగ్రెస్‌ నేతలను కలిసేందుకు గవర్నర్‌ నిరాకరణ. నిరాశతో రాజ్‌భవన్‌ నుంచి వెనుదిరిగిన కాంగ్రెస్‌ నేతలు.
 • కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి..? (ప్రత్యేక వ్యాసం)
 • గవర్నర్‌ను కలిసిన సిద్ధరామయ్య. రాజీనామా సమర్పణ
 • కభీ ఖుషీ... కభీ గమ్‌

View image on TwitterView image on Twitter

Amit@Enchutiasticone

घर से निकलते कुछ दूर
ही चलते ही     

 • ప్రకాష్‌ రాజ్‌ను వొదలని ట్విట్టరిటి

#KarnatakaVerdict #KarnatakaElections2018 pic.twitter.com/1GP6Ulhqqo

GAVASKAR@gavastk

 

 • కర్ణాటకం
 • ఓట్లు కాంగ్రెస్‌కు
  సీట్లు బీజేపీకి
  సీఎం పదవి జేడీఎస్‌కు

 • అదరగొట్టిన శివకుమార్‌

  వివాదాస్పద నేత, రాష్ట్ర మంత్రి డీకే శికుమార్‌ రికార్డు మెజారిటీ గెలుపొందారు. నగర కనకపుర నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా 70,286 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనకు లక్షా 20వేల ఓట్లు పోలవగా, రెండో స్థానంలో ఉన్న జనతాదళ్‌ (ఎస్‌) నేత నారాయణ గౌడకు 45వేల ఓట్లు పడ్డాయి. కౌంటింగ్‌ చివరిదశలో ఉంది.

 • మెజార్టీలో ఆమెది రికార్డు
  బెల్గాం రూరల్‌ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి లక్ష్మీ హెబ్బల్కర్‌ రికార్డు మెజారిటీతో గెలుపొందారు. సమీపీ బీజేపీ అబ్యర్థి సంజయ్‌ పాటిల్‌కు 50వేల ఓట్లు  రాగా, లక్ష్మీకి లక్షా రెండు వేల ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 23 వేల ఓట్లు పడ్డాయి.

 • నో కామెంట్‌
 • కాంగ్రెస్‌, జేడీఎస్‌ల పొత్తు గురించి మాట్లాడేందుకు బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప నిరాకరించారు. శిఖరపుర నుంచి బెంగళూరుకు చేరిన యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఈయన ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. 

GoNews@GoNews24x7

"I don't want to discuss about Congress or JD(S)", BS Yeddyurappa, BJP refuses to answer questions to the media.  

 • గవర్నర్‌ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు

 • బీజేపీ కూడా...
  ఒకవైపు కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతుండగా బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ఇండిపెండ్‌ అభ్యర్థుల  మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తోంది. అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా తాము గవర్నర్‌ను కలుస్తామని, మెజారిటీ నిరూపించుకునేందుకు కొంత సమయం కోరాలని బీజేపీ భావిస్తోంది.
 • ఉమ్మడి పోరుకు సై 

 • కాంగ్రెస్‌, జేడీఎస్‌ల మధ్య ఒప్పందంలో కీలక షరతు చేరింది. అదేమిటంటే ఇపుడు ఇరు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటు 2019లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి.

 • ఫార్ములా ఇదే
  బయటి నుంచి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్‌. ససేమిరా అన్న దేవేగౌడ. ప్రభుత్వం చేరాలన్న జేడీఎస్‌ డిమాండ్‌కు కాంగ్రెస్‌ ఓకే. జేడీఎస్‌ నుంచి కుమార స్వామి సీఎం అవుతారు. కాంగ్రెస్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారు. కాంగ్రెస్‌ నుంచి 20, జేడీఎస్‌ నుంచి 17 మంత్రులు ఉంటారు.

 • గవర్నర్‌ కీలకం
  ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అంటున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌. సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్‌తో భేటీ. అతి పెద్ద పార్టీకి పిలుస్తారా లేదా అతి పెద్ద కూటమిని ఆహ్వానిస్తారా.. కన్నడ నాట పొలిటికల్‌ టెన్షన్‌   
 • సీనియర్ల భేటీ
  సీఎమ్ సిద్ధరామయ్య ఇంట్లో కాంగ్రెస్ సీనియర్ల భేటీ. జేడిఎస్ తో చర్చించాలనుకుంటున్న అంశాలపై చర్చ.
  సీనియర్లు గెహ్లాట్, ఆజాద్..వేణుగోపాల్..పరమేశ్వర..మల్లికార్జున ఖర్గే
 • మా ఆఫర్‌ను ఆమోదించారు: కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్

  దేవెగౌడ, కుమారస్వామితో టెలిఫోన్‌లో మాట్లాడాం. మా ఆఫర్‌ను వారు అంగీకరించారు. మా మద్దతును రాతపూర్వకంగా గవర్నర్‌కు తెలిపుతాం.

 • నాలుగు గంటల కు‌ గవర్నర్ ను కలిసి‌ రాజీనామ పత్రాన్ని సమర్పించనున్న సిద్దరామయ్య
 • హంగ్‌తో షేర్ల లాభాలు ఆవిరి

  బీజేపీకి స్పష్టమైన మెజార్టి వస్తోందన్న వార్తలతో ఒకదశలో వంద పాయింట్లకు పైగా లాభడిన నిఫ్టి..   లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. బీజేపీకి మ్యాజిక్‌ ఫిగర్‌ దక్కకపోవడంతో పాటు కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవడంతో నిఫ్టి లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. తాజా సమాచారం మేరకు నిఫ్టి 10,804 వద్ద ట్రేడవుతోంది. 

 • స్వీట్లు సరే... సీటు దక్కుతుందా?

View image on TwitterView image on TwitterView image on TwitterView image on Twitter

Nand Kishore Yadav@nkishoreyadav

 चुनाव में भारतीय जनता पार्टी की शानदार जीत पर प्रदेश कार्यालय में पार्टी कार्यकर्ताओं के साथ जश्न मनाते हुए..    

 • జేడీఎస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలపాలని నిర్ణయించాం: కర్ణాటక పీసీసీ చీఫ్‌
 • సాయంత్రం గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్న కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు.
 • కర్ణాటకలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు

          గోవా ఉదంతం పునరావృతం కాకూడదని కాంగ్రెస్‌ నిర్ణయం..  జేడీఎస్‌కు సీఎం పోస్ట్‌ ఆఫర్‌

 • కాంగ్రెస్‌ ఆఫర్‌తో దేవెగౌడ క్యాంప్‌లో ఉత్సాహం
  ఎమ్మెల్యేలతో దేవెగౌడ సమావేశం                                                                                                                                                                                                                    
 • ఒకే ఒక్కసారి: ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన
  నేను కోరేది ఒకటే. బీజేపీ ఈవీఎంలకు బదులు బ్యాలెట్‌ పేపర్‌ ఆధారంగా ఎన్నికలు పోటీ చేయమనండి. ఒకే ఒక్కసారి. అన్ని రకాల ఆందోళనలు పోతాయి. 

 •  
 • సంఖ్యా పరమైన గెలుపు: యనమల
  కర్ణాటకలో బీజేపీ గెలుపు సంఖ్యాపరమైన గెలుపని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సీట్ల పరంగా గెలిచినా...ఓట్ల  పరకంగా బీజేపీది ఓటమేనని అన్నారు. 60 శాతానికి పైగా ప్రజలు బీజేపీని వ్యతిరేకించారని అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో టీడీపీ ఎక్కడా ప్రచారం చేయలేదని యనమల గుర్తుచేశారు.

 • జేడీఎస్ తో పొత్తుకు మేం రెడీ...
 • తమ్మునిపై అన్న విజయం

  దివంగత కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ బంగారప్ప కుమారుల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో అన్న కుమార బంగారప్ప గెలిచారు. కాంగ్రెస్‌ నేత అయిన కుమార బంగారప్ప ఎన్నికల ముందు బీజేపీలో చేరి పోటీ చేశారు. తమ్ముడు మధు బంగారప్ప జనతాదల్‌ (ఎస్‌) టికెట్‌పై పోటీ చేశారు. ప్రారంభంలో మధుకు లీడ్‌ దక్కినా... విజయం కుమార బంగారప్పకే దక్కింది. ఇద్దరూ కన్నసినీ రంగానికి పరిచయమున్నవారే.

 • కర్ణాటకలో టెన్షన్‌. మ్యాజిక్‌ ఫిగర్‌ రాని బీజేపీ       
 •  జనతాదళ్‌ (ఎస్‌) అధినేత దేవెగౌడకు సోనియా గాంధీ ఫోన్‌. సీఎం పదవి కుమారస్వామికి ఇస్తామని హామి.
 • గెలుపు

        బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప శికారిపుర నుంచి 35,397 ఓట్ల మెజారిటీతో గెలుపు పొందారు. కాంగ్రెస్‌కు చెందిన గోని మాలతేస్తాను ఆయన ఓడించారు.

 • పురంధేశ్వరి :

 • బీజేపీని ఓడించాలన్న చంద్రబాబుకు ఈ గెలుపే సమాధానం. మోడీ ఇమేజ్, యడ్యూరప్ప చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు విజయానికి దోహదం చేశాయి.

 •  

 • మెజారిటీ మంత్రులు వెనుకంజ

సిద్ధరామయ్య కేబినెట్‌లోని మెజారిటీ మంత్రులు వెనుకంజలో ఉన్నారు. 13 మంది గెలుపు బాటలో ఉండగా... 15 మంది వెనుకబడి ఉన్నారు. స్వయంగా సీఎం సిద్ధరాయమ్య చాముండేశ్వరిలో భారీ తేడాతో ఓడిపోయారు. వెనుకంజలో ఉన్న మంత్రుల్లో హెచ్‌ ఆంజనేయ, వినయ్‌ కులకర్ణి, సంతోస్ లాడ్‌, ఎ. మంజు, ప్రమోద్‌ మధ్వరాజ్‌, ఉమశ్రీ, అభయ్‌చంద్ర జైన్‌ ఉన్నారు.

 • జనతాదళ్‌ (ఎస్‌)తో కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి అన్నారు.  చాలా భిన్నంగా ఉండేవన్నారు. విజేతలకు అభినందనలు తెలుపుతూనే... పోరాటం చేయడంటూ ఓడినవారికి సలహా ఇచ్చారామె.

Mamata Banerjee@MamataOfficial

Congratulations to the winners of the Karnataka elections. For those who lost, fight back. If Congress had gone into an alliance with the JD(S), the result would have been different. Very different

 • కర్ణాటక లో బీజేపీ ఆధిక్యం తో బీజేపీ స్టేట్ ఆఫీస్ లో సంబరాలు జరుపుకుంటున్నారు...
   నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో సంబరాల్లో పాల్గొన్న  లక్ష్మణ్ , దత్తాత్రేయ, nvs ప్రభాకర్, కిషన్ రెడ్డి ...పలువురు నేతలు...కార్యకర్తలు.. బీజేపీ శ్రేణులు.
 • ఓట్లు ఎక్కువ.. సీట్లు తక్కువ

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌ ప్రకారం చూస్తే కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు అంటే 71.04 లక్షల ఓట్లు పోలయ్యాయి. కాని 73 సీట్లలో ఆధిక్యం        లభించింది. 37.2 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 107 సీట్లలో రాణించింది. 17.4 శాతం ఓట్లతో 39 సీట్లను కొల్లగొట్టింది జనతాదళ్‌ (ఎస్‌).

 

 • ఇక శెలవు 

Kumar@Kumar88755025

Khel katham, dhukaan bandh!!!  Siddaramaiah CM Karnataka

బహుజన సమాజ్‌ పార్టీ కర్ణాటకలో ఖాతా తెరిచి చరిత్ర సృష్టించింది. కొలేగల్‌ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున  పోటీ చేసిన ఎన్‌ చంద్ర విజయం సాధించారు. 1957 నుంచి ఒక్కసారి మినహా ప్రతిసారీ ఇక్కడ కాంగ్రెస్‌ గెలుస్తూ వచ్చింది.

        విజేతలు :

 •  BTM lay out...రామ్ లింగా రెడ్డి (కాంగ్రెస్)
 • మల్లేశ్వరం... అశ్వర్థనారాయన (బీజేపీ)
 • శివాజీ నగర్...రోషన్ బేగ్ (కాంగ్రెస్)
 • చామ్ రాజ్ పేట్..జమీర్ అహ్మడ్ ఖాన్‌..(కాంగ్రెస్)
 • రాజాజీ నగర్..సురేష్ (బీజేపి)
 • మహాలక్ష్మి లే ఔట్..గోపాలయ్య..(జెడి)S
 • యశ్వంత్ పూర్..జవరే గౌడ్..(జెడి)S
 •  పద్మనాభ నగర్..అశోక్ (బీజేపి)
 • బసవన గుడి..రవి సుబ్రహ్మణ్య (బీజేపి)
 • చిక్ పేట..ఉదయగడా చార్య (బీజేపి)
 • దాసరహల్లె..మునిరాజ్ (బీజేపి)
 • బంగారు పేట్..నారాయణ స్వామి (కాంగ్రెస్)
 • హమ్మయ్య....
  బాదామిలో సిద్ధరామయ్య గెలుపు. బీజేపీ అభ్యర్థి బి. శ్రీరాములుపై 2150 ఓట్లతో విజయం.
 • హెలికాప్టర్ ‌లో శిఖరిపుర నుండి‌ బెంగుళూరు కి బయలు దేరిన యడ్యూరప్ప.. కాసేపట్లో బెంగళూరు బీజేపీ  ఆఫీస్ కి యడ్డీ. ప్రెస్ మీట్ తర్వాత ఢిల్లీ కి వెళ్ళనున్న యడ్డీ.

 • విజేతలు :

 • హెబ్బాల్..బై రెడ్డి సురేష్ (కాంగ్రెస్‌) 

 • గోవిందా రాజ్ నగర్..సోమన్న (బీజేపి)

 • యశ్వంత పుర...  జవరయ్య గౌడ (జేడిఎస్)

 • యలహంక...విశ్వనాథ్ (బీజేపి) 

 • బోట్రాయపుర..కృష్ణ బైరేగౌడ (కాంగ్రెస్)

 • బొమ్మనహళ్  విజయ్ నగర్ రవీంద్ర..(బీజేపి)

 • బొమ్మనహాల్...సతీస్ రెడ్డి (బీజేపి)

 • కేఆర్‌ పురం... బైరవతిప్పే బసవరాజ్ (కాంగ్రెస్)

 • శాంత్రి నగర్...  హార్రీస్ (కాంగ్రెస్) 

 • గాంధీ నగర్..దినేష్ గుండూ రావు (కాంగ్రెస్)

 • సర్వజ్ఞ నగర్.. కేజీ జార్జి (కాంగ్రెస్)

 • నటుడు అంబరీష్ కి సీట్ ఇవ్వకపోవడంతో  కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు.
 • మాండ్యా జిల్లాలో JDS క్లీన్ స్వీప్...ఏడు సీట్లు దేవేగౌడ పార్టీకే.
 •  కర్ణాటక ప్రజలు మోడీ నాయకత్వం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బిజేపి పై చేసిన తప్పుడు ప్రచారాన్ని కర్ణాటకలోని తెలుగు ప్రజలు తిప్పికొట్టారన్నారు.  ఆంధ్ర ప్రదేశ్ తో సహా కేంద్రంలో మోడీ నేతృత్వంలో బిజేపి అధికారంలోకి కావడం తధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 • సెంటిమెంటా.. మజాకా...
  చామ్‌రాజ్‌నగర్‌లో అడుగుపెట్టిన ఏ సీఎం కూడా గడచిన 40 ఏళ్ళలో మళ్ళీ సీఎం కాలేదు. జిల్లాకు రెండుసార్లు వచ్చిన పీఎం మోడీ కూడా ఇటువైపు కన్నేత్తి చూడలేదు. మొన్నటికి మొన్న కుమారస్వామి గౌడ వరకు చామ్‌రాజ్‌ నగర్‌ సెంటిమెంట్‌ ఇదే. నలభై ఏళ్ళుగా సాగుతున్నీ సెంటిమెంట్‌ను కాదని సీఎం సిద్దరాయమ్య చామ్‌రాజ్‌ నగర్‌లో పర్యటించారు. తాను నాస్తికుడినంటూ ఈ నియోజకవర్గంలో 9 సార్లు పర్యటించారు.  కాని సెంటిమెంట్‌ గెలిచింది. సిద్ధరామయ్య సీఎం పదవి పోగొట్టుకున్నారు.
 • బెంగళూరు రూరల్‌ జిల్లాలో జనతాదళ్‌ (ఎస్‌) హవా. నాలుగింటిలో మూడు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ముందంజ. నీలమంగళ, దొడ్డబళ్ళాపుర, దేవనహళ్ళి నియోజవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు భారీ మెజారిటీ. హోసకోట్‌లో మాత్రం మాజ ఈ మంత్రి బచ్చేగౌడ కుమారుడు శరత్‌ బచ్చేగౌడ లీడింగ్‌లో ఉన్నారు.
 • కర్ణాటక లో బీజేపీ ఆధిక్యంతో నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ లో సంబరాలు జరుపుకుంటున్నారు..నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్ కి చేరుకుంటున్న బీజేపీ కార్యకర్తలు శ్రేణులు...
 • దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల పై ఉంటుంది. 
 • కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి బీటీఎం లేఔట్‌ నియోజకవర్గంలో 8,715 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
 •  
 • కోస్టల్‌ కర్ణాటకలో బీజేపీ క్లీన్‌ స్వీప్‌. 19 నియోజకవర్గాల్లో 17 స్థానాల్లో బీజేపీ గెలుపు. 
 • కొనసాగిన 33 ఏళ్ళ సెంటిమెంట్‌... 1984లో రామకృష్ణ హెగ్డే తరవాత అధికారంలో ఉన్న సీఎం వెంటనే మళ్ళీ సీఎం కాలేదు. సిద్ధరామయ్య ఓటమితో ఆ సెంటిమెంట్‌ కొనసాగనుంది.
 • సతీష్‌ రెడ్డికి భారీ ఆధిక్యం... బెంగళూరు నగరంలోని బొమ్మనహళ్ళి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సతీష్‌ రెడ్డి భారీ ఆధిక్యం సాధించారు. ప్రస్తుతం ఆయన సమీప ప్రత్యర్థిపై 21,500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
 • మళ్ళీ అదే స్థానంలో సాయి కుమార్. కర్ణాటక-ఆంధ్రా సరిహద్దులోని బాగేపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటుడు సాయికుమార్‌ మళ్ళీ నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 2008లో ఇక్కడి నుంచి ఇదే పార్టీపై పోటీ చేసిన సాయికుమార్‌కు అప్పుడు కూడా నాలుగో స్థానంలో నిలిచారు. చిత్రమేమిటంటే పదేళ్ళ తరవాత కూడా కాంగ్రెస్‌, జనతాదళ్‌, సీపీఎంలు ఈ నియోజవకర్గంలో బలంగా ఉండటమే.
 • బీజేపీ సీనియర్‌ నేత కె ఎస్‌ ఈశ్వరప్ప షిమోగలో 24,104 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
 • కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యడ్యూరప్ప
 • శికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప గెలుపు... సీఎం, డిప్యూటీ సీఎం అభ్యర్థులు రెడీ...
 • చాముండేశ్వరిలో సిద్ధరామయ్య ఓటమి.
 • పార్టీనే అశ్చర్యపరుస్తున్న అంకెలు. అదనంగా 70 స్థానాల్లో గెలిచిన బీజేపీ. ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్‌. జనతాదళ్‌ (ఎస్‌)తో కుదరిన లోపాయికారీ ఒప్పందంతో గణనీయంగా లబ్ది పొందిన బీజేపీ. కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరిగినా... సీట్లు తగ్గడానికి కారణం... నియోజకవర్గాల్లో బీజేపీ, జనతాదళ్‌ (ఎస్‌) ఓట్లు బదిలీ కావడమే.
 • ములకలమూరులో బీజేపీ అభ్యర్థి బి శ్రీరాములు గెలుపు. బాదామిలో సిద్ధరామయ్య ముందంజ

 • నిఫ్టి జూమ్‌... కర్ఱాటకలో బీజేపీ సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు ఖాయం కావడంతో స్టాక్‌ మార్కెట్‌ పరుగులు తీస్తోంది. నిఫ్టి 10900 మార్క్‌ను దాటింది.  క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 10900 స్థాయిని దాటింది. నిఫ్టిలో ఏకంగా 40 షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టి షేర్లలో టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్, టైటాన్‌, హిందాల్కో, ఎస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముందున్నాయి.
 • తొలి విజయం నమోదు చేసుకున్న కోటాయాన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఉమానాథ్. 
 • ఇంకాస్సేపు ఆగండి అంటున్న మల్లిఖార్జున ఖర్గే... 
 • చాముండేశ్వరిలో ఓటమి దిశగా సీఎం సిద్ధరామయ్య. జేడీఎస్‌ అభ్యర్థి జీటీ దేవెగౌడ భారీ ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. అయిదు రౌండ్లు పూర్తయ్యే సరికి 13,000 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
 • ట్విట్టర్‌ లో నటుడు ప్రకాష్‌ రాజ్‌పై పెరుగుతున్న దాడి...
 • పలువురు  మంత్రులు వెనుకంజ. 
 • బీజేపీ లీడ్‌తో పాటు పెరుగుతున్న షేర్‌ మార్కెట్‌. ఉదయం పేలవంగా  ప్రారంభమైన మార్కెట్‌...బీజేపీ ఆధిక్యం వంద సీట్లను దాటేసరికి నిఫ్టి 55 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 10,861 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. నిఫ్టిలో 31 షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి.
 • సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ?. 
 • లింగాయత్ బెల్ట్‌లో బీజేపీకి భారీ ఆధిక్యం. 
 • స్టాక్‌ మార్కెట్‌ పేలవంగా ప్రారంభమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం లేదని... హంగ్‌ ఖాయంగా కన్పిస్తోంది. కౌంటింగ్‌లో ట్రెండ్‌ను బట్టి నిఫ్టి కదలికలు ఉంటాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి గౌరవప్రదమైన స్కోరు రావడంతో మార్కెట్‌ కరెక్షన్‌ ఉండకపోవచ్చని వీరు భావిస్తున్నారు.
 • చాముండేశ్వరిలో సిద్ధరామయ్యపై జనతాదళ్‌ (ఎస్‌) అభ్యర్థి జీటీ దేవేగౌడ 12800 ఓట్ల ఆధిక్యం. 
 • హరప్పనహళ్ళిలో గాలి సోదరుడు కరుణాకర్‌ రెడ్డి ముందంజ. 
 • అన్న  కుమార బంగారప్పపై ముందంజలో మధు బంగారప్ప. ఎస్‌ బంగారప్ప కుమారులైన వీరిద్దరూ సోరబ్‌లో పోటీ పడుతున్నారు. మధు బంగారప్ప  జనతాదళ్‌ (ఎస్‌) టికెట్‌పై పోటీ చేశారు.
 • బాదామిలో సిద్ధరామయ్య ముందంజ. 
 • ఐపీఎల్‌ మ్యాచ్‌ను తలపిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు. 
 • హంగ్‌ దిశగా కర్ణాటక. 
 • రామనగర, చెన్నపట్నలో హెచ్‌డీ కుమారస్వామి  ముందంజ. 
 • చిత్తాపూర్‌లో ప్రియాంక ఖర్గే ముందంజ. 
 • శ్రీనివాసపురలో రమేస్‌ కుమార్‌ ముందంజ. 
 • చాముండేశ్వరిలో సిద్ధరామయ్య 5000 ఓట్లతో వెనుకంజ. 
 • శికారిపురలో యడ్యూరప్ప ముందంజ.
 • కోస్తా, బెంగళూరు, హైదరాబాద్‌ కర్ణాటక, సెంట్రల్‌ కర్ణాటకలో బీజేపీ ముందంజ. ఓల్డ్ మైసూర్‌ ప్రాంతాల్లో జనతాదళ్‌ (ఎస్‌) ముందంజ. 
 • గ్రేటర్‌ బెంగళూరులో బీజేపీ హవా
 • మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. రెండో స్థానంలో కాంగ్రెస్‌
 • కళ తప్పిన కర్ణాటక కాంగ్రెస్‌ భవన్‌
 • శివమొగ్గ నుంచి ఈశ్వరప్ప ముందంజ
 • గాలి బ్రదర్స్‌ ముందంజ
 • డబుల్‌ ట్రబుల్‌...ముఖ్యమంత్రి సిద్ధరాయమ్య రెండు చోట్లా వెనుకంజ. చాముండేశ్వరిలో జనతాదళ్‌ ఎస్‌ అభ్యర్థి, బాదామిలో బీజేపీ అభ్యర్థి ముందుంజ
 • హరప్పనహళ్లిలో బీజేపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి ఆధిక్యం
 • రామ్ నగర్ లో ఆధిక్యంలో జేడీఎస్ అభ్యర్థి కుమారస్వామి
 • వరుణలో సిద్ధ రామయ్య కొడుకు యతీంద్ర ఆధిక్యం
 • బళ్లారిలో పూజలు చేసిన బాదామి బయలు దేరిన శ్రీరాములు. 
 • రామ్ నగర్ లో కుమార స్వామి ముందంజ. కాంగ్రెస్ 27, బీజేపీ 23.
 • హోరాహోరీగా ఎన్నికల కౌంటింగ్. బాదామిలో సిద్ధ రామయ్యపై శ్రీరాములు ఆధిక్యం. 
 • ట్రెండ్స్.. 17 స్థానాల్లో కాంగ్రెస్‌, నాలుగు స్థానాల్లో బీజేపీ, మూడు స్థానాల్లో జనతాదళ్ (ఎస్‌) ముందంజ.
 • ఓకే రాష్ట్రానికి పరిమితమైన కాంగ్రెస్‌. ప్రస్తుతం పంజాబ్‌లో కాంగ్రెస్‌ పాలన ఉంది. పాండిచ్చేరిలోనూ ఉన్నా.. అది కేంద్ర పాలిత ప్రాంతం.
 • మాండ్య చేరుకున్న కుమారస్వామి. కాలభైరవ స్వామి దేవాలయం లో‌ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు.
 • షేర్‌ మార్కట్‌లో టెన్సన్‌ః కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ షేర్‌ మార్కెట్‌లో టెన్షన్‌ నెలకొంది. ఉదయం మార్కెట్‌ ప్రారంభమయ్యే సరికే ట్రెండ్‌ వచ్చే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు నిస్తేజంగా ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు కూడా డల్‌గా ఉన్నాయి. మన మార్కెట్ల ట్రెండ్‌కు దిక్సూచి అయిన సింగపూర్‌ నిఫ్టి ప్రస్తుతం నిలకడగా ఉంది. అయిదు పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.
 •  పీపుల్స్ పవర్‌ : గత నాలుగు ఎన్నికల్లో పోలింగ్‌ సరళి. ఈసారి పోటెత్తిన ఓటర్లు
 • భారీ భద్రతః ముందస్తు చర్యగా బెంగళూరు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11,000 మంది పోలీసులు, ఒక ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కంపెనీ, 20 కర్ణాటక రాష్ట్ర రిజర్వ్ పోలీసులు బలగాలు సిద్ధం. 
 • కేక్‌ రెడీః కాంగ్రెస్‌ కార్యకర్తల ఉత్సాహం. రాష్ట్ర మంత్రి డీకే శివ కుమార్‌ మద్దతుదారులు 52 కేజీల విధానసౌధ కేక్‌ను రేడీ చేశారు...
 • అదృష్టం పరీక్షించుకోనున్న 2,655 మంది అభ్యర్థులు. 4.96 ,82,357 ఓట్లను లెక్కించేందుకు 56,696 పోలింగ్ బూతులు ఏర్పాటు.