11 హత్యలు...11 రోజులు... తేలిందేంటి?

11 హత్యలు...11 రోజులు... తేలిందేంటి?

ఢిల్లీలోని బురారీలో జరిగిన 11 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. 11 మంది మృతికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక పోలీసులకు అందింది. భాటీయా కుటుంబంలో మొత్తం 11 మంది మృతి చెందగా.. వారిలో 10 మంది ఉరి వేసుకొని మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. దీంతో పోస్ట్ మార్టమ్ నివేదికపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, వారంతట వారే ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో తెలిపారు. 

జులై 1న దేశ రాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పోలీసులు మాత్రం వీరందరూ కేవలం మూఢనమ్మకాల నేపథ్యంలోనే ఉరివేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మూఢ నమ్మకాలకు పరాకాష్టగా నిలిచిన ఈ ఆత్మహత్యల కేసులో జరిగిన 11 సంఘటనలను ఓసారి చూస్తే...

* జూలై 1న ఉదయం భాటియా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పక్కింటివాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు 11 మృతదేహాలను చూసి షాక్ కు గురయ్యారు.

*బురారీ ఘటనలో బాటియా కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. వీరిలో నారాయణిదేవి, ఆమె ఇద్దరు కుమారులైన భన్వేష్, లలిత్, కోడళ్లు.. సవిత, టీనా, కూతురు ప్రతిభతో పాటు ఐదుగురు మనుమళ్లు, మనువరాళ్లు ఉన్నారు.

* సంచలనం రేపిన ఈ ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సందర్శించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ భాటియా కుటుంబానికి ఎటువంటి ఆర్ధిక పరమైన సమస్యలు లేవని అన్నారు. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

*ఆ కుటుంబంలో మొత్తం 11 మంది మృతి చెందగా.. వారిలో 10 మంది ఉరి వేసుకొని మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, వారంతట వారే ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

* ఘటన స్థలంలో పోలీసులు ఓ పది అంశాలతో కూడిన చేతిరాత స్క్రిప్టును గుర్తించారు. అందులో రాసి ఉన్న అంశాలు.. సంఘటనా స్థలంలోని పరిస్థితులను పోల్చి చూశారు. దాదాపు 25 చిన్నా, పెద్ద నోట్‌బుక్స్‌ దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

*పోలీసులు తమ దర్యాప్తులో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ లో ఉరివేసుకోవడానికి స్టూల్స్, వైరులు తీసుకువస్తున్న విజువల్స్ రికార్డు అయ్యాయి.

*కేసులో కీలకంగా మారిన డైరీలు, పుస్తకాలు, లెటర్స్ లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్‌ భాటియా చేతి రాతతో సరిపోయాయి. లలిత్‌ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు చెబుతున్నారు.

*పదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కనిపించాడని, తనతో మాట్లాడుతున్నాడని.. మనమంతా ఏం చేయాలో చెబుతున్నాడని లలిత్‌ భాటియా మిగతా కుటుంబసభ్యులకు చెప్పాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్‌లో, డైరీల్లో రాశాడని, అవే విషయాలను మిగతా కుటుంబ సభ్యులకు తెలియజేశాడని పోలీసులు అంటున్నారు.

* చిన్నకుమారైన లలిత్‌ భాటియా తన తండ్రి కలలో కనిపించి మాట్లాడతాడని, అప్పుడప్పుడు ఆయన ఆత్మ కూడా ఆవహిస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారితో చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది.
 
*భాటియా కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడానికి 15రోజుల ముందు నారాయణిదేవి మనవరాలైన ప్రియాంక నిశ్చితార్ధం నోయిడాకు చెందిన ఓ సాప్ట్ వేర్ ఇంజనీరుతో జరిగింది. ఆ యువకుడికి ఈ మూఢనమ్మకాలను కొట్టిపడేశాడు.

*కుటుంబంలో మొత్తం 11 మంది మృతి చెందగా.. వారిలో 10 మంది ఉరి వేసుకొని మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని, వారంతట వారే ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. పక్క గదిలో మృతిచెంది ఉన్న ఇంటి పెద్దావిడ నారయణీ దేవి.. ఎలా చనిపోయానే విషయాన్ని మాత్రం నివేదకలో వెల్లడించలేదు.