తెలంగాణాకి కరోనా రిలీఫ్..ఆ 11 మందికి కరోనా నెగటివ్

తెలంగాణాకి కరోనా రిలీఫ్..ఆ 11 మందికి కరోనా నెగటివ్

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేసులసంఖ్య 67కు చేరింది. దీనికి తోడు ఇప్పటికే ఓమరణం సైతం నమోదైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతోంది.  అధికారులకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తోంది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడంతో పాటు ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయినా సరే కొందరు రోడ్లపైకి వస్తుండడంతో.. పోలీసులు కౌన్సెలింగ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల విచక్షణ కోల్పోతున్న పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది.

ఇక తెలంగాణలో 11 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కొంతకాలంగా కరోనా పాజిటివ్‌తో చికిత్స తీసుకున్న 11మంది బాధితులు ఇప్పుడు కోలుకున్నారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని  తెలిపారు మంత్రి కేటీఆర్.  తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేశారు. 11 మంది బాధితులను 3రోజులపాటు పరిశీలనలో ఉంచి పంపిస్తామని తెలిపారు కేటీఆర్.  మరోవైపు ... కరోనా బాధితుల కోసం కింగ్ కోఠి ఆస్పత్రి సిద్ధమైంది.  350 పడకలతో ఆస్పత్రిని సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా బాధితుల కోసం మరో నాలుగు ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నామన్నారు.