కరోనాపై ఇవి వైరల్... అస్సలు నమ్మకండి...

కరోనాపై ఇవి వైరల్... అస్సలు నమ్మకండి...

కరోనా వైరస్, లాక్ డౌన్ తో... ఎవ్వరు బయటకు వెళ్లలేని పరిస్థితి.. ఇదే సమయంలో కొంత మంది కళాకారులు సోషల్ మీడియాలో బయలుదేరారు.. కొంతమంది కొన్నిఆడియోలు రికార్డ్ చేసి వదిలితే.. మరి కొందరు.. తోచిన తప్పుడు సమాచారాన్ని సర్యులేట్ చేస్తున్నారు. ఇలా ఒకటి కాదు... రెండు కాదు.. దాదాపు 13  ఫేక్ న్యూస్ లు సర్క్యులేట్ చేస్తూ కొందరికి లేనిపోని భయాలు కలిపిస్తూ... మరికొందరికి ఆశలు కూడా కల్పిస్తున్నారు. ఆ ఫేక్ న్యూస్ ని గుర్తించిన తెలంగాణ పోలీసులు.. వాటిని నమ్మోదంటూ ఓ ప్రకటన విడుదల చేసారు. 

ఇక, ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కొన్ని తప్పుడు విషయాలు.. ఇప్పుడు మీ దృష్టికి తెస్తున్నాం.
1. అపోలో డాక్టర్ ..రిపోర్టర్ సంభాషణ
2. జెడి లక్ష్మీనారాయణ గారి వాయిస్
3. ఇటలీలో ట్రక్కులో కుప్పల శవాలు
4. Jio వారి లైఫ్ టైం ఫ్రీ రీఛార్జి
5. డాక్టర్ దంపతుల మరణం
6. రష్యా 500 సింహాలు రోడ్లపై వదలడం
7. కరోనా వైరస్ కు డాక్టర్ గుప్త మందు
8. రోడ్ల పైన పడిఉన్న దేహాలు
9. డాక్టర్ నరేష్ పేరుతో వస్తున్న ఎమర్జెన్సీ ప్రకటన
10. COVID-19 పేరుతో మార్కెట్ లోకి మందు
11. ఆవుకు పుట్టిన మనిషి
12. మోడీ గారి 1000 జీబీ డేటా ఫ్రీ..
13. బనగానపల్లెలో బ్రహ్మం గారి శిష్యుడు కరోనాకు మందును చెప్పి చనిపోయాడు.. ఈ ఊర్లో, ఆ ఊర్లో కరోనా అంటూ వదంతులు.... ఇలాంటివి మన ఫోనులో మరెన్నో.. ఇలాంటి తప్పుడు వార్తల మధ్య "వాస్తవాలు" నలిగిపోతున్నాయి.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజలను తప్పుద్రోవ పట్టించడం, భయభ్రాంతులకు గురిచేయడం, ఉద్రేకపరచడం, చాలా ప్రమాదం.. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మనం అనుసరిద్దాం.. మీకు ఇలాంటి మీసేజ్ లు మీకు వస్తే చూసి వదిలేయండి.. తప్పుడు సమాచారం మరికొంత మందికి పంపి భయాందోళనకు గురి చేయకండి. అసలే కరోనాతో ఇబ్బందులు పడుతున్నాం.. ఈ సమయంలో మరింత బుద్ధిబలంతో వ్యవహరించండి.