రష్యా కురిల్ ఐలాండ్ లో భారీ భూకంపం... సునామి హెచ్చరిక... 

రష్యా కురిల్ ఐలాండ్ లో భారీ భూకంపం... సునామి హెచ్చరిక... 

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంటే, రష్యా మాత్రం కరోనా ను కంట్రోల్ చేయడంలో చాలా ముందు ఉన్నది.రష్యాలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అమలు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ అతి తక్కువ కేసులు మాత్రమే నమోదయ్యాయి.  అయితే, 15 రోజులు ఇంట్లో ఉంటారా లేదంటే బయటకు వచ్చి ఐదేళ్లు జైల్లో ఉంటారా అనే నిబంధనను అమలు చేయడంతో రష్యా ప్రజలు భయపడి ఇళ్లకే పరిమితం అవుతున్నారు. 

ఇదిలా ఉంటె, ఈరోజు రష్యాను భూకంపం వణికించింది.  రష్యాకు చెందిన కురిల్ ఐలాండ్ లో భూకంపం సంభవించింది.  రిక్టర్ స్కేల్ పై 7.5 గా నమోదైన ఈ భూకంపం వలన ఎంతటి ఆస్తినష్టం వచ్చింది.  ఎంత ప్రాణనష్టం జరిగింది అనే విషయాలు తెలియాల్సి ఉన్నది. అయితే, కురిల్ ఐలాండ్ కు 138 మైళ్ళ దూరంలో భూకంప కేంద్రం ఉన్నది.  దీంతో ఆ ప్రాంతంలో సునామి హెచ్చరికలను జారీ చేశారు.