90 ఎంఎల్.. కిక్కిచ్చింది..!!
సినిమా అంటే గ్లామర్. సినిమా ఎంత గ్లామర్ గా ఉంటె అంత హిట్ అవుతుంది. కథకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. కథనాలు, పూర్తి స్థాయి గ్లామర్ తో తెరను నింపేస్తున్నారు. బీప్ సౌండ్స్ ఎక్కువగా ఉండే డైలాగులతో సినిమా పూర్తి చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు సాధారణంగా ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అసలు సినిమాలో ఏం చెప్పబోతున్నాం అనే విషయాలను చెప్పి చెప్పనట్టుగా చెప్పేదే ట్రైలర్. ప్రతి ఒక్కరు కూడా ట్రైలర్ ను గ్లామర్ గా కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.
రీసెంట్ గా 90 ఎంఎల్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. రెండు నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులతోను.. శృతి మించిన గ్లామర్ తోనూ.. లిప్ టు లిప్ కిస్ లతోను నింపేశారు. యూత్ ను ఎట్రాక్ట్ చేసేందుకే ఇలా కట్ చేసుంటారు. అర్జున్ రెడ్డి తరువాత రొమాంటిక్ జానర్లో వచ్చే సినిమాలు అన్ని దాదాపుగా ఇలాగే ఉంటున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)