మోడీ, అంబేద్కర్‌లు బ్రాహ్మణులే..: స్పీకర్

మోడీ, అంబేద్కర్‌లు బ్రాహ్మణులే..: స్పీకర్

గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్‌, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీలను బ్రాహ్మణులుగా అభివర్ణించారు. గాంధీనగర్‌లో జరిగిన మెగా బ్రాహ్మిణ్ బిజినెస్ సమ్మిట్‌కు హాజరైన ఆయన అక్కడికి విచ్చేసిన పారిశ్రామిక వేత్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్, మోడీలు బ్రాహ్మణులని అన్నారు.. మేధావులంతా తన దృష్టిలో బ్రాహ్మణులేనని.. దానిని బట్టి అంబేద్కర్ బ్రాహ్మణుడేనని అన్నారు.. ఆయన పేరులోని అంబేద్కర్ అనేది బ్రాహ్మణుల ఇంటిపేరని.. ఆయన మేథస్సును మెచ్చుకుని ఆయనకు చదువుచెప్పిన ఉపాధ్యాయుడు అంబేద్కర్ ‌అని పిలిచారని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణులు ఎప్పుడూ అధికారం కోసం తహతహలాడలేదని.. అలాంటి ఆశేఉంటే చంద్రగుప్త మౌర్య బదులు చాణుక్యుడే రాజు అయ్యేవాడని అన్నారు. ఎందరినో చక్రవర్తులుగా తీర్చిదిద్దన ఘనత బ్రాహ్మణులదేనని వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతంలో ఐదుగురు రాష్ట్రపతులుగా.. ఏడుగురు ప్రధాన మంత్రులుగా.. 50 మంది ముఖ్యమంత్రులుగా.. 50 కంటే ఎక్కువమంది గవర్నర్లుగా దేశానికి సేవలు అందించారని కొనియాడారు.