వీడియో: తాబేలుపై ఫ్రీ రైడ్ చేస్తున్న పాము

వీడియో: తాబేలుపై ఫ్రీ రైడ్ చేస్తున్న పాము

ఎడారిలో తాబేళ్లు, పాములతో పాటు అనేక రకాల జీవరాశులు జీవిస్తుంటాయి. అయితే ఓ పాము, తాబేలు స్నేహం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా!. ఇదిగో తాబేలుపై పాము ఫ్రీ రైడ్ చేస్తున్న ఈ వీడియోను చూస్తే మీకే అర్ధం అవుతుంది. పాము, తాబేలు అంతలా స్నేహం చేస్తున్నాయి మరి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. 'నేను చూసిన వేగవంతమైన ఉబెర్ రైడ్ ఇదే'.. 'ఏంటి ఇది' అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'ఆ పాము మరీ సోమరితనంగా ఉంది' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.