చాలా రోజులతర్వాత ఇండియా వచ్చిన స్టార్ హీరో

చాలా రోజులతర్వాత ఇండియా వచ్చిన స్టార్ హీరో

దేశంలో అభిమానుల తాకిడి ఉండడం, మంచి మంచి లొకేషన్ల కోసం ఇతర దేశాల్లో చిత్రాలు షూటింగ్‌ చేస్తుంటారు మన దర్శకులు. అయితే మలయాళంలో మంచి స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్‌ కూడా ఇలాగే తన చిత్రం కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయాడు. కరోనా కారణంగా జోర్డాన్లో ఇరుక్కుపోయిన ‘ఆడుజీవితం’ చిత్రయూనిట్ సభ్యులు మొత్తం 58మంది ‘వందే భారత్ మిషన్’ సహాయంతో భారత దేశానికి ఢిల్లీ మీదుగా కేరళలోని కొచ్చి విమాశ్రయానికి చేరుకున్నారు.తన  భర్త సురక్షితంగా తిరిగి రావడం పట్ల పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ భావోద్వేగానికి గురై.. ఇన్స్టాగ్రామ్లో ఉద్వేగపూరిత పోస్ట్ చేశారు. . ‘‘దాదాపు రెండు నెలల తర్వాత పృథ్వీరాజ్ ఆయన చిత్ర బృందం కేరళ చేరుకున్నారు. నిబంధనల ప్రకారం.. వారంతా క్వారంటైన్కు వెళ్తున్నారు. వారికోసం ఎంతగానో వేచి చూసాం. వారంతా సురక్షితంగా ఇళ్లకు తిరిగి రావడానికి సహకరించిన అధికారులకు.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." అంటూ పోస్ట్ పెట్టారు.