లక్ష్మి రాయ్ అమ్మమ్మ అయింది..!!

లక్ష్మి రాయ్ అమ్మమ్మ అయింది..!!

కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లక్ష్మి రాయ్.. తన అందచందాలతో అడపాదడపా  దక్కించుకుంటూనే ఉన్నది.  సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఆడి పాడింది. ప్రస్తుతం తమిళ, మలయాళం భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.  ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ బిజీగా ఉంటుంది.  కాగా, ఇటీవలే ట్విట్టర్ ద్వారా తాను అమ్మమ్మ అయినట్టుగా ప్రకటించింది.  

లక్ష్మీరాయ్ అమ్మమ్మ కావడం ఏంటి.. అసలు ఆమెకు ఇంకా వివాహం కాలేదు కదా అనే డౌట్ రావొచ్చు.  ఆ డౌట్స్ కు కూడా లక్ష్మీరాయ్ సమాధానం ఇచ్చింది.  లక్ష్మీరాయ్ మియు.. లియు అనే రెండు కుక్కపిల్లల్ని పెంచుకుంటున్నది.  ఆ రెండింటిని సొంత బిడ్డల్లా చూసుకుంటున్నదట.  ఇటీవలే వీటికి రెండు పిల్లలు పుట్టాయి.  వాటికి టిఫాని.. పకో అనే పేరు పెట్టింది.  ఈ విధంగా లక్ష్మీరాయ్ అమ్మమ్మ అయిందట.