ఆర్ధిక ఇబ్బందుల పై క్లారిటీ ఇచ్చిన రాశి

ఆర్ధిక ఇబ్బందుల పై క్లారిటీ ఇచ్చిన రాశి

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన భామల్లో రాశి కూడా ఒకరు. హీరోయింగ్ టాప్ పొజిషన్ లో ఉన్న రాశి. ఆ తరవాత వ్యాంప్ క్యారెక్టర్స్ లోకూడా నటించి మెప్పించారు. ఆ తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకొని ఈ మధ్య తల్లి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే  కొంతకాలంగా రాశి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు షికారు చేశాయి. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆమె ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వార్తలు వచ్చాయి. 

తాజాగా ఈ వార్తలపై స్పందించారు రాశి. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె సమాధానం చెప్పారు. తాను ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు పడటం లేదని, తాను కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతున్నాను. సింపుల్ గా హ్యాపీగా తన జీవితం సాగుతుందని  చెప్పుకొచ్చింది. సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలంటూ రాశి పేర్కొన్నారు.