వంద కోట్లు ఇస్తే.. తాప్సి వాటికి ఫుల్ స్టాప్ పెడుతుందట..!!

వంద కోట్లు ఇస్తే.. తాప్సి వాటికి ఫుల్ స్టాప్ పెడుతుందట..!!

ఢిల్లీ బ్యూటీ, సొట్ట బుగ్గల తాప్సి బాలీవుడ్ లో దూసుకుపోతున్నది.  ఈ అమ్మడు నటించిన పింక్, నామ్ షబానా చిత్రాలు ఘనవిజయం సాధించాయి.  ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ మంచి పాత్రలు చేస్తున్నది.  మరోవైపు తన చిత్రాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ దూసుకుపోతున్న తాప్సి, సడెన్ గా జుడ్వా 2 చిత్రంలో పూర్తిస్థాయి గ్లామర్ పాత్రలో కనిపించింది షాక్ ఇచ్చింది.  బికినీ మెరుపులు మెరిపించిన  తాప్సిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.  మంచి పాత్రలు చేస్తున్న తాప్సి ఎందుకు సడెన్ గా ఇలా బికినీలో నటించింది.. ఆ అవసరం ఏమొచ్చిందని అభిమానులు మెసేజ్ లు చేయడం మొదలు పెట్టారు.  

ఈ మెసేజ్ లకు తాప్సి ఘాటుగా  రిప్లయ్ ఇచ్చింది.  జుడ్వా2 వంద కోట్లు వసూలు చేసిందని, వంద కోట్ల సినిమాను ఎలా వదులుకుంటానని ప్రశ్నించింది.  త్వరలో విడుదల కాబోతున్న ముల్క్ సినిమాకు వంద కోట్ల కలెక్షన్లు వచ్చే విధంగా హిట్ చేస్తే.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని సోషల్ మీడియా ద్వారా ఛాలెంజ్ విసిరింది తాప్సి.  మరి తాప్సి ఛాలెంజ్ నెరవేరుతుందా.. చూద్దాం.