మిస్టర్ మజ్నుగా అఖిల్ !

మిస్టర్ మజ్నుగా అఖిల్ !

అక్కినేని అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్ర షూటింగ్ చాలా రోజుల నుండి విదేశాల్లోనే జరుగుతోంది.  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్ ఖరారు చేశారట.  ఫిల్మ్ ఛాంబర్లో కూడ ఈ టైటిల్ రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. 

నాగార్జున కెరీర్లోని హిట్ సినిమాల్లో 'మజ్ను' కూడ ఒకటి.  ఇప్పుడు అదే టైటిల్ అఖిల్ సినిమాకు పెడుతుండటం విశేషం.  వెంకీ అట్లూరి మొదటి సినిమా 'తొలిప్రేమ' భారీ విజయాన్ని అందుకోవడంతో అఖిల్ సినిమాపై మంచి అంచనాలున్నాయి.  బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది.