తనకు ఎవరితోనూ ఎఫైర్ లేవంటున్న నటుడి మాజీ భార్య ..

తనకు ఎవరితోనూ ఎఫైర్ లేవంటున్న నటుడి మాజీ భార్య ..

సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్ అయిపోయింది. నచ్చకపోతే విడిపోవడమే మంచిది అంటున్నారు వాళ్లు కూడా. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఇప్పటికే ఈయన తొలి భార్య నుంచి విడాకులు తీసుకుని.. 2009లో అలియాని రెండో వివాహం చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు నవాజుద్దీన్ కుటుంబంలో కొన్ని గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యంలో రెండో భార్య అలియా కూడా ఈయన నుంచి విడాకులు కోరుతూ మే 7న లీగల్ నవాజుద్దీన్‌కు నోటీసులు పంపారు.  తాజాగా తనకున్న ఎఫైర్స్ కారణంగా విడాకులిచ్చిందన్న ప్రచారానికి బదులిచ్చారు అలియా. తాజాగా ఆలియా సిద్ధిఖీ ట్విట్టర్ లో ‘నా గురించి నిజాలు చెప్పాలనే ట్విట్టర్ లో ఖాతా తెరిచానని.. అపార్థాలు తొలగించాలనుకుంటున్నానని.. నిశ్చబ్దాన్ని దుర్వినియోగం  చేసి అసత్యాలు ప్రచారం చేసే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ పనిచేస్తున్నానని’ వివరణ ఇచ్చింది.ఇక తనకు ఎవరితోనూ ఎఫైర్ లేదని.. ఇలాంటి వదంతులు ఆపాలని ట్విట్టర్ లో పేర్కొంది..