60 కుటుంబాలకు చేయూతనిచ్చిన యాంకర్ !

60 కుటుంబాలకు చేయూతనిచ్చిన యాంకర్ !


 భారత్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీని ప్రభావం అన్ని రంగాలపై పడింది. వీటిలో సినీ, టెలివిజన్‌ రంగాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ వల్ల సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజువారీ వేతనాలకు పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో 'కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు. ఈ చారిటీకి ఇప్పటికే చిరు రూ.కోటి రూపాయలు ఇవ్వగా.. నాగార్జున రూ. కోటి, మహేష్ బాబు రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.30లక్షలు అందించారు. అలాగే నాగ చైతన్య రూ.25లక్షలు, యంగ్ హీరో కార్తికేయ రూ.2 లక్షలు తమ తరపున విరాళాలు అందజేశారు.ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రకటించారు. అంతేకాకుండా స్థోమత ఉన్నవారు ముందుకు వచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన సాయాన్ని అందించాలని కోరారు.