మే 28 వరకు ఎవరూ బయటకు రావొద్దు...ఎందుకంటే...

మే 28 వరకు ఎవరూ బయటకు రావొద్దు...ఎందుకంటే...

ఏపీలో ఒకవైపు కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది.  రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి.  నిన్నా మొన్నటి వరకు ప్రజలు దాదాపుగా ఇంటికే పరిమితం అయ్యారు.  అయితే, మే 18 నుంచి లాక్ డౌన్ 4.0లో కొన్ని సడలింపులు ఇచ్చారు.  ఈ సడలింపులు వలన ప్రజలు బయటకు వస్తున్నారు.  కరోనా భయపెడుతున్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్నారు.  అయితే, ఇప్పుడు మరొక ఏపి ప్రజలకు మరొక ముప్పు పొంచి ఉన్నది.  మే 28 వ తేదీ వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  ముఖ్యంగా కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది.  వేడిగాలులు వీస్తాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ కూడా బయటకు రావొద్దని అంటున్నారు.  మహిళలు, పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు.  

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.  కాటన్ దుస్తులు ధరించాలి. చేతిలో గొడుగు లేకుండా బయటకు రావొద్దు.  వాటర్, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.