మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్... వారి ఖాతాల్లో రూ.5వేలు జమ... 

మరో గుడ్ న్యూస్ చెప్పిన జగన్... వారి ఖాతాల్లో రూ.5వేలు జమ... 

ఏపీలో కరోనా వైరస్ ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే.  కరోనా వైరస్ కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఆగిపోయారు.  నాలుగో దశ లాక్ డౌన్ సమయంలో సడలింపులు ఇస్తున్నారు.  ఇప్పుడిప్పుడే అన్ని దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి.  అయితే, అన్ని మతపరమైన దేవాలయాలు మాత్రం ఈనెల 31 వరకు మూసే ఉంచుతున్నారు.  దీంతో చిన్న చిన్న దేవాలయాల్లోని అర్చకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  

ఇది గ్రహించిన ఏపి ప్రభుత్వం వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.  దేవాలయాల్లో పనిచేస్తున్న 31,017 మంది అర్చకులకు రూ.5వేల రూపాయలు అందించాలని నిర్ణయించింది.  అర్చకులతో పాటు 7వేలమంది ఇమాంలు, మౌజంలు, 29,841 మంది పాస్టర్ల ఖాతాల్లోకి కూడా రూ.5వేలు జామకాబోతున్నాయి. దీని కోసం ఏపి ప్రభుత్వం రూ. 33.93 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది.