కరోనా కోసం ఆధునిక టెక్నాలజీ.. భాదితులకు జియో ట్యాగింగ్

కరోనా కోసం ఆధునిక టెక్నాలజీ.. భాదితులకు జియో ట్యాగింగ్

కరోనా నివారణ చర్యల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు... ఆధునిక టెక్నాలజీతో, సాంకేతిక నిపుణులైన అధికారుల బృందంతో ఏపీ పోలీస్ శాఖను  ముందుకు తీసుకెళ్తున్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్... విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి వారి  కదలికలపై నిఘా కోసం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట వేయనున్నారు. హౌస్  క్వారంటైన్ యాప్ పేరుతో సరికొత్త అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చిన ఏపీ పోలీసులు. ఒక్కరోజులోనేహౌస్ క్వారంటైన్ అప్లికేషన్ లో విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన ఐదు వేల మంది వివరాలను పొందుపర్చారు. మరో 24 గంటల్లో 20 వేల మంది వివరాలను అప్లికేషన్ లో నమోదు చేస్తారు. అప్లికేషన్ లో నమోదైన వివరాలు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేసి.. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెడతారు. ఇంటి నుండి 50 మీటర్ల జియో ట్యాగింగ్ పరిధి దాటి బయటకు వస్తే తక్షణమే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఆటో మ్యాటిక్ గా సమాచారం చేరుతుంది. నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసారు.