రాష్ట్రంలో మరో 6 కేసులు నమోదు - ఈటెల

 రాష్ట్రంలో మరో 6 కేసులు నమోదు - ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో కరొనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  నిన్నటి వరకు 59 కేసులున్న తెలంగాణలో ఈరోజు మరో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం 65 పాజిటివ్ కేసులు నమోదయ్యయ్యయి. ఇదే విషయాన్ని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.  కరోనా వైరస్ ప్రభావంపై ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.  కరోనా వైరస్ ను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తోందని అన్నారు.  వలస కార్మికులు ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా చర్యలు ప్రారంభించినట్టు ఈటెల పేర్కొన్నారు.  ఖైరతాబాద్ కు చెందిన 74 ఏళ్ల వృద్దుడు కరోనాతో మృతి చెందినట్టు తెలిపారు.  గ్లోబల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ  మృతి చెందారని, తరువాత ఆయనకు కరోనా ఉన్నట్టు నిర్ధారణ జరిగినట్టు ఈటెల పేర్కొన్నారు.  

ఓ కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా వైరస్ సోకినట్టుగా ఈటెల పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి అడుపులోనే ఉందని ఎవరూ కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అన్నారు.  అలానే ఉదయం నుంచి రెడ్  జోన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయని, అవి పూర్తిగా అవాస్తవం అని ఈటెల పేర్కొన్నారు.  ఇలాంటి వార్తలు నమ్మొద్దని అన్నారు.   ప్రార్ధన మందిరాలలో ప్రార్ధనల పేరుతో గుమి గూడవద్దని కేసీఆర్ పేర్కొన్నారని, ఇలా చేయడం వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అన్నారు.  కరోనా వైరస్ ను అరికట్టాలి అంటే ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాలని ఈటెల పేర్కొన్నారు.