వరంగల్‌లో 9 మంది మృతి మిస్టరీ.. మరో ట్విస్ట్..!

వరంగల్‌లో 9 మంది మృతి మిస్టరీ.. మరో ట్విస్ట్..!

వరంగల్ బావిలో అనుమానాస్పదంగా మరణించిన తొమ్మిది మంది మృతుల కేసు పోలీసులకు సవాల్ గా మారింది. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్‌ బావి కేసులో ఆ గంటలో ఏం జరిగిందన్న దానిపై పోలీసులు ఆరా  తీస్తున్నారు. సాయంత్రం ఆరుగంటలకి  నిషా, కృషు, ఆలం, సోయాబ్, శ్రీరామ్, శ్యామల సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఏడు గంటలకి మక్సూద్ తన ఇంటికి షకీల్ ను పిలిచినట్టు విచారణలో తెలిసింది. 7.45కు గోదాం యజమానితో మక్సూద్ మాట్లాడాడు. అయితే 9 గంటలకు అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో బుధవారం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ఏం జరిగింది? గంట లోపల మక్సూద్ దగ్గరికి ఎవరు వచ్చారు? అందరిపైనా ఫుడ్ పాయిజన్ జరిగిందా?  అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నెల నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్రా ఆలం కూడా తన మూడేళ్ల కుమారుడితో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వీరితో పాటుగా గన్నీ సంచుల గోదాం పక్కనే ఉన్నపై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు కూడా నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గోదాం వద్దకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో.. పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూశారు. నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలాడుతూ కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఓకే కుటుంబానికి చెందిన మాసూద్ అలం, భార్య నిషా అలం , బూస్రా అలం , ఈమె మూడు సంవత్సరాల బాలుడి దేహాలు బావిలో నుంచి వెలికి తీశారు. నిన్న బావిలో నీటిని తోడుతుండగా మసూద్ అలం పెద్ద కుమారుడు శబాజ్ అలం, చిన్న కుమారుడు సోహిల్ అలం  వీరితో పాటు గోనె సంచుల గోదాం వద్దకు వాహనాలను నడిపే డ్రైవర్ షకీల్ తో పాటు బీహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్ ల మృతదేహాలు వెలికి తీశారు.
 
ఒకే బావిలో ఐదుగురు మృతదేహాల లభ్యం కావటంతో బీహర్‌కు చెందిన శ్రీరాం, శ్యాం, షకీల్, శాభాజ్‌ల ఆచూకి లేక పోవటంతో అనుమానం వచ్చి బావిలో నీటిని తోడించారు అధికారులు. అనుమానించినట్టే మరో ఐదుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. భర్తతో విడిపోయిన మసూద్ కూతురు బుస్రా నగరంలోని ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బుస్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంటిపై ఉంటున్న బీహార్‌కు చెందిన కార్మికులు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకుని బుస్రాపై కన్నేసినట్లు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బుస్రా ప్రియుడు వారితో‌ మూడు రోజుల కిందట మసూద్ ఇంట్లో విందుకు హజరైనట్లుగా చెబుతున్నారు. ఈ విందులో జరిగిన ఘర్షణతో బీహార్ యువకులు మసూద్ కుటుంబాన్ని చంపి బావిలో పడేసి.. భయంతో వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం తొమ్మిది మంది మృతికి కారణాలేంటి..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు. పాడు బడిన వ్యవసాయ భావి వద్దకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.  మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అందరు కలిసి నాలుగు రోజుల కిందట బర్త్‌ డే పార్టీ చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ పార్టీలో ఎవరైనా ఆహరంలో విషం కలిపి ఉంటారా..? లేక విషం ఇచ్చి చంపేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.