యంగ్ హీరో సరసన అను ఇమాన్యుల్.. !

యంగ్ హీరో సరసన అను ఇమాన్యుల్.. !

టాలీవుడ్ లోనాని హీరోగా వచ్చిన "మజ్ను" సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యూయేల్. వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ డైరెక్షన్‌లో 'అజ్ఞాతవాసి' సినిమా నటించింది. దాంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తాయని భావించారు. కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అమ్మడి ఆశలపై నీళ్లు జల్లినట్టయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ "నా పేరు సూర్య" సినిమాతో మరో డిజాస్టర్‌ను అందుకుంది. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ యంగ్ హీరోతో కలిసి నటిస్తుంది. నిఖిల్ హీరోగా రూపొందుతోన్న '18 పేజెస్' చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించనుందట. కొన్ని రోజుల క్రితం కృతి శెట్టి పేరు వినపడ్డప్పటికీ అను ఇమ్మాన్యుయేల్‌కే మేకర్స్ మొగ్గు చూపారట. ప్రస్తుతం అనుతో చర్చలు జరుపుతున్నారట. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సుకుమార్ కథ, మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే.