బాపినీడు మృతికి చంద్రబాబు సంతాపం

బాపినీడు మృతికి చంద్రబాబు సంతాపం

సినీ నిర్మాత, దర్శకుడు గుత్తా బాపినీడు చౌదరి ( విజయ బాపినీడు) మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలకు సంపాదకుడుగా వ్యవహరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయబాపినీడు అని చంద్రబాబు కొనియాడారు. ఉత్తమ అభిరుచితో కుటుంబ కథాచిత్రాలను నిర్మించిన కొద్దిమంది నిర్మాతల్లో విజయబాపినీడు ఒకరు అని ముఖ్యమంత్రి నివాళి అర్పించారు.విజయబాపినీడు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని  తెలియజేసారు.