ఏపీలో 21 కి చేరిన పాజిటివ్ కేసులు

ఏపీలో 21 కి చేరిన పాజిటివ్ కేసులు

ఏపీలో చాపకింద నీరులా కరోనా విస్తరిస్తోంది. ఇప్పటివరకూ 21 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఈరోజు రెండు కేసులు పాజిటివ్ వచ్చాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ మంత్రులతో సీఎం జగన్ కరోనా పరిస్ధితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు. లాక్ డౌన్ సమయంలోనూ కేసులు పెరుగుతుండడంతో.. మరిన్ని నిబంధనల్ని అమలు చేయాలని నిర్ణయానికొచ్చారు. పట్టణాలు, నగరాల్లో నిత్యవసరాల కొనుగోలుకు ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటలవరకూ సమయమిచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిత్యవసరాలు కొనుగోలు చేయవచ్చు. నిత్యవసరాలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతీ దుకాణం దగ్గర పట్టికలు ప్రదర్శించాలని సూచించారు. అదే విధంగా రేషన్ దుకాణాల దగ్గర సామాజిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ వాలంటీర్లు సర్వే  పటిష్టంగా నిర్వహించి.. ప్రతీ కుటుంబం విరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.