ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ చేయూత... భారీ ప్యాకేజీ

ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ చేయూత... భారీ ప్యాకేజీ

ఈరోజు ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల కలెక్టర్లతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలపై చర్చించారు.  ఎంఎస్ఎంఈ లను కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.  వారిని కాపాడుకోలేకపోతే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు.  అందుకోసం ఎంఎస్ఎంఈ లకు భారీ పోత్సాహకాలు ఇస్తున్నట్టు ప్రకటించారు.  

ప్రైవేట్ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఎంఎస్ఎంఈ లే అని జగన్ పేర్కొన్నారు.  రాష్ట్రంలోని కలెక్టర్లు ఈ రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. ఆర్ధికంగా రాష్ట్రం పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా వారిని ఎంఎస్ఎంఈ లను ఆడుకుంటున్నామని అన్నారు.  గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈ లకు ప్రోత్సాహకాలు ఇస్తామని మాట ఇచ్చి పక్కన పెట్టిందని, ఈ ప్రభుత్వం అలా కాకుండా వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చినట్టు జగన్ తెలిపారు.  ప్రతి పరిశ్రమకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కార్యక్రమం చేపడుతున్నట్టు జగన్ పేర్కొన్నారు.  వర్కింగ్ క్యాపిటల్ రుణాలు తక్కువ వడ్డీకే ఇచ్చేందుకు రూ.200 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తునట్టు జగన్ తెలిపారు.  ఇవే కాకుండా ఎంఎస్ఎంఈలను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు జగన్ ఈ సందర్భంగా తెలిపారు.  ఇక గత నెల మాదిరిగా కాకుండా ఉద్యోగులకు మే నెల జీతాలు పూర్తిగా చెల్లించబోతున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.