ఏపీ సర్కార్ కి హైకోర్టులో షాక్.. రంగుల జీవో మళ్లీ రద్దు...!

 ఏపీ సర్కార్ కి హైకోర్టులో షాక్.. రంగుల జీవో మళ్లీ రద్దు...!

పంచాయతీ కార్యాలయాలకు రంగులపై ఏపీ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ప్రస్తుతమున్న 3 రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో 623 ను సస్పెండ్‌ చేసింది హైకోర్టు. పార్టీ రంగులపై సుప్రీం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై కేసు సుమోటోగా తీసుకుంటున్నామని తెలిపింది. ఈ నెల 28 లోగా వివరణ ఇవ్వాలని సీఎస్‌, పంచాయతీశాఖ కార్యదర్శి, ఈసీని ఆదేశించింది హైకోర్టు. ఐతే పంచాయతీ ఆఫీసులకు వేస్తున్న రంగులు పార్టీ రంగు కాదని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న పార్టీ రంగులను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తే.. ప్రభుత్వం మరో రంగును అదనంగా వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని సోమయాజులు అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించడం లేదని సోమయాజులు ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 3 రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపినా, న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వం కోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని చెబుతూ, జీవోను రద్దు చేసింది.