ఫుల్లుగా మందేసి నడవలేక ఆర్టీసీ బస్సు చోరీ...

ఫుల్లుగా మందేసి నడవలేక ఆర్టీసీ బస్సు చోరీ...

ఫుల్లుగా మందేశాడు.. వెళ్లాల్సింది చాలా దూరం.. అసలే ఎలాంటి రవాణా లేదు.. దీంతో.. ఆర్టీసీ బస్సునే చోరీ చేశాడో మందు బాబు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలో ఓ మందు బాబు ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు.. బెంగళూరులో నివాసం ఉండే మెహదీన్‌ అనే వ్యక్తి అనంతపురం జిల్లాలో బంధువుల ఇంటికి వచ్చాడు.. తిరుగు ప్రయాణంలోనే సమస్య వచ్చింది.. ధర్మవరం వరకూ నడుచుకుంటూ వెళ్లిన ఆ వ్యక్తి.. ఫుల్లుగా మంద్యం తాగాడు.. ఇక, నడవలేని పరిస్థితి వచ్చింది.. దీంతో, ధర్మవరంలో ఆర్టీసీ బస్సునే అపహరించాడు.. ఆర్టీసీ బస్సు అయితే, ఎవ్వరూ ఆపరనే ఉద్దేశంతో.. బెంగళూరుకు బయల్దేరాడు.. కానీ, ఆ బస్సును గమనించిన ఓ ఆర్టీసీ డ్రైవర్.. డయల్ 100కు ఫోన్ కొట్టడంతో అప్రమత్తమైన కియా ఇండస్ట్రీయల్ ఏరియా పోలీసులు.. రోడ్డుకు అండగా లారీలను పెట్టి బస్సును ఆపేశారు.