ముంబై అండర్-23 జట్టులో జూనియర్ సచిన్
లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ (19) టెండూల్కర్ ముంబై అండర్-23 వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 15వ తేదీ నుంచి పంజాబ్‌తో తలపడే 15 మంది సభ్యుల జట్టులో అర్జున్‌కు స్థానం దక్కింది. గతేడాది భారత్ అండర్ 19 జట్టుకు ఎంపికైన అర్జున్.. ఇప్పుడు సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. లెఫ్టార్మ్ పేసర్ అయిన అర్జున్.. తల్యార్ఖాన్ మెమోరియల్ ఇన్విటేషన్ టోర్నీలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తరఫున తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండేళ్లుగా నిలకడగా రాణిస్తున్న అర్జున్.. గతేడాది కూచ్ బిహార్ టోర్నీలోనూ సత్తా చాటాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)