ఫ్లిప్‌కార్ట్‌లో 'అసుస్ డేస్ సేల్'.. ఫోన్లపై రాయితీలు

ఫ్లిప్‌కార్ట్‌లో 'అసుస్ డేస్ సేల్'.. ఫోన్లపై రాయితీలు

ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 'అసుస్ డేస్ సేల్‌'ను ప్రారంభించింది. బుధవారం ప్రారంభమయిన ఈ సేల్ శుక్రవారం వరకు కొన‌సాగుతుంది. 'అసుస్ డేస్ సేల్‌'లో ప‌లు అసుస్ ఫోన్లపై భారీ  రాయితీలు, ఆఫ‌ర్ల‌ను ప్రకటించింది. 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ అసుస్ జెన్‌ఫోన్ 5జ‌డ్ వేరియెంట్ రూ.8వేల త‌గ్గింపుతో రూ. 28,999 ధ‌ర‌కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8వేల త‌గ్గింపుతో రూ.24,999 ధ‌ర‌కు లభిస్తుంది. 

జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ వెయ్యి తగ్గింపుతో రూ.12,999 ధ‌ర‌కు.. 4జీబీ ర్యామ్‌,  64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు.. 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.8,999 ధ‌ర‌కు అందుబాటులో ఉంది. ఇక అసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 రూ.4,999 ధ‌ర‌కు ల‌భిస్తుంది.