భారత్‌తో టీ-20లో తలపడే ఆసీస్‌ టీమ్ ఇదే

భారత్‌తో టీ-20లో తలపడే ఆసీస్‌ టీమ్ ఇదే

భారత్‌తో సొంతగడ్డపై జరగబోయే టీ-20 సిరీస్‌కు 13 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఆస్ట్రేలియా ప్రకటించింది. టీ-20 టీమ్‌కు ఆరోన్‌ పింఛ్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. భారత్‌తో మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు, నవంబర్ 17న దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ-20కి కూడా ఇదే జట్టుని ప్రకటించింది. ఆసీస్ స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. స్టార్క్‌తో పాటు స్పిన్నర్ నేథన్ లయన్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌లకు కూడా స్థానం దక్కలేదు. భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఉన్న నేపథ్యంలో వారందరికీ స్థానం కల్పించలేదని ఆసీస్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. వారి స్థానంలో మార్కస్ స్టాయినిస్, జేసన్ బెహ్రెండార్ఫ్‌లకు చోటు కల్పించారు.

ఆస్ట్రేలియా జట్టు:

ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ కేరీ, ఆష్టన్ అగర్, జేసన్ బెహ్రండార్ఫ్, నేథన్ కౌల్టర్ నైల్, క్రిస్ లిన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మాట్, డార్సీ షార్ట్, బిల్లీ స్టాన్‌లేక్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, ఆడమ్ జంపా.