సిడ్నీ వన్డేః టీమిండియా టార్గెట్ 289

సిడ్నీ వన్డేః టీమిండియా టార్గెట్ 289

సిడ్నీ వేదికగా జరుగుతున్న తొలివన్డేలో ఆసీస్ ఐదు వికెట్ట నష్టానికి 288 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ అరోన్ ఫించ్ (6: 11 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ కాగా.. కాసేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ అలెక్స్ క్యారీ (24: 34 బంతుల్లో 5x4) స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొదటి నుంచి నిలకడగా ఆడిన ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6x4) హఫ్ సెంచరీ చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4x4) అర్థ శతకం సాధించి కుల్ దీప్ బౌలింగ్ లో షమికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. పీటర్‌ హాండ్స్‌కాంబ్ (73: 61 బంతుల్లో 6x4, 6x2) భువనేశ్వర్ బౌలింగ్ లో థవన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మార్కస్‌ స్టోయినిస్‌ (47: 43 బంతుల్లో 2x4), గ్లెన్ మాక్స్ వెల్ (11: 5 బంతుల్లో ఒక ఫోర్) నాటౌట్ గా నిలిచారు.