అడిలైడ్ టెస్ట్: కష్టాల్లో టీమిండియా

అడిలైడ్ టెస్ట్: కష్టాల్లో టీమిండియా

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ కష్టాల్లో పడింది. 49 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ప్రస్తుతం చతేశ్వర పుజారా (35 బ్యాటింగ్, 119 బంతుల్లో.. 3 ఫోర్లు), అశ్విన్ (0 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) మ‌రోసారి నిరాశ ప‌ర‌చ‌గా.. కెప్టెన్ విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్ (25) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు.