128 ఏళ్ల రికార్డును సమం చేసిన బంగ్లా
128 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సమం చేసింది. బంగ్లా బౌలర్లు ఓ టెస్ట్ మ్యాచ్ లో అతి త్వరగా టాప్ ఐదు బ్యాట్స్ మెన్ లను క్లీన్ బోల్డ్ చేశారు. స్పిన్నర్లు మెహదీ హసన్ మిరాజ్ (3/36), షకీబుల్ హసన్ (2/15)లు కలిసి ఐదు వికెట్లు తీశారు. బ్రాత్‌వైట్ (0), పావెల్ (4), హోప్ (10), అంబ్రిస్ (7), చేజ్ (0) వరుసగా క్లీన్‌బౌల్డ్ అయ్యారు. అతి త్వరగా ఐదు వికెట్లు తీయడంతో.. 128 ఏళ్ల రికార్డును బంగ్లా సమం చేసింది. ఢాకా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఈ రికార్డు నమోదయింది. ఇంతకుముందు క్రికెట్ లో రెండు సార్లు మాత్రమే టాప్ ఐదు బ్యాట్స్ మెన్ లు క్లీన్ బోల్డ్ అయ్యారు. 1878/79లో ఇంగ్లాండ్, 1890లో ఆస్ట్రేలియాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి. 29 పరుగులకే వెస్టిండీస్ ఐదు వికెట్లు చేజార్చుకుంటే.. ఆసీస్ 47, ఇంగ్లాండ్ 45 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ రెండో రోజే మ్యాచ్ పై పట్టుసాధించింది. రెండో రోజంతా బంగ్లా ఆధిపత్యంలోనే సాగింది. ఓవర్‌నైట్ స్కోరు 259/5తో శనివారం ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. బ్యాట్స్‌మన్ మహ్మూదుల్లా (136) సెంచరీ సాధించాడు. కెప్టెన్ షకీబ్ (80), లిటన్ దాస్ (54) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్..బంగ్లా స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక మూడో రోజు రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. విండీస్ ఇంకా 349 పరుగులు వెనుకపడి ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)