మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం...ఎల్లుండి నుంచి అందరి అకౌంట్లలో...

మరో గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం...ఎల్లుండి నుంచి అందరి అకౌంట్లలో...

కరోనా విళయతాండవం చెస్తున్న నేపథ్యంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది...గత రెండు నెలలుగా దేశ ప్రజలకు అనేక రాయితీలను ప్రకటిస్తూ వస్తుంది...అందులో భాగంగా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్ధిక చితికిపోయినా సామాన్య ప్రజలకు ముఖ్యంగా మహిళలకు రెండు నెలలుగా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆర్థిక సాయం ప్రకటించింది...

జన్ ధన్ ఖాతాలు ఉన్న ప్రతి మహిళల అకౌంట్లలో కేంద్రం రూ.500 ఖాతాలో జమచేస్తుంది..కాగా మొదటి రెండు విడతల్లో ఖాతాల్లో డబ్బులు వేసిన కేంద్రం ఈ సారి కూడా జమ చేయనుంది...కేంద్రం ఉచిత బియ్యంతో పాటు...ఈ డబ్బు అదనంగా ఇస్తుంది..తాజాగా మరోసారి జన్ ధన్ ఖాతాలు ఉన్న మహిళల అకౌంట్లలో మరో విడతగా రూ.500 జమ చేయనుంది...

జూన్ 5 నుండి జూన్ 10 వరకు వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయని కేంద్రం ప్రకటించింది...ప్రజలను ఆర్థికంగా ఆదుకోడానికి కేంద్రం అందిస్తున్న సహాయంలో భాగంగా చివరి విడతగా డబ్బులు జమ చేయనుంది.