భారతీయుడు 2 కు లైన్ క్లియర్

భారతీయుడు 2 కు లైన్ క్లియర్

శంకర్ నెక్స్ట్ సినిమాను అప్పుడే ప్రకటించేశాడు.   రోబో 2పాయింట్ ఓ సినిమా చివరి దశకు చేరుకున్నది.  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  నవంబర్ 29 వ తేదీన సినిమా రిలీజ్ కానున్నది.  ఇదిలా ఉంటె, ఒకవైపు రోబో 2 ఎండింగ్ కార్యక్రమాలను చూసుకుంటూనే మరోవైపు భారతీయుడు2  సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు.  

కమల్ హాసన్ హీరోగా రాబోతున్న ఈ సినిమా తమిళ బిగ్ బాస్ 2 కంప్లీట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్తుంది.  దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నది.  లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది.