ఎంఐఎం నేతలనెందుకు బహిష్కరించలేదు?

ఎంఐఎం నేతలనెందుకు బహిష్కరించలేదు?

స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడమంటే హిందువులను బహిష్కరిచినట్టేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ పరిపూర్ణానంద బహిష్కరణ ప్రభుత్వం కుట్ర అని అన్నారు. బహిష్కరణ నిర్ణయంపై ప్రభుత్వం పునారలోచించుకోవాలని కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముని నిందించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం సరికాదన్న లక్ష్మాణ్‌.. ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. హిందూ దేవతలను తూలనాడిన ఎంఐఎం నేతలను బహిష్కరించలేదని నిలదీశారు.