లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బొమ్మాలి గర్జన ..!!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బొమ్మాలి గర్జన ..!!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది.  త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ న్యూస్ ను బయటకు రిలీజ్ చేయబోతున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సాంగ్స్ బయటకు రిలీజ్ అయ్యాయి.  వాడిగా, వేడిగా, సూటిగా ఉండటంతో పాటలకు హైప్ వచ్చింది.  

ఇందులో గర్జన.. సింహ గర్జన అనే సాంగ్ ఉంది.  ఈ సాంగ్ ను డబ్బింగ్ ఆర్టిస్ట్ బొమ్మాలి రవి పాడటం విశేషం.  సిరాశ్రీ రాసిన పాటను బొమ్మాలి రవి పాడాడు.  ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియోను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.