వైరస్‌తో వణికిపోతున్న బ్రెజిల్‌, స్పెయిన్‌..అమెరికాలో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

వైరస్‌తో వణికిపోతున్న బ్రెజిల్‌, స్పెయిన్‌..అమెరికాలో 16 లక్షలు దాటిన కరోనా కేసులు

బ్రెజిల్‌, మెక్సికో, బ్రిటన్‌, స్పెయిన్‌ తదితర దేశాల్లోనూ పరిస్థితులు విషమంగానే ఉన్నాయి. వైరస్‌ సృష్టిస్తున్న బీభత్సానికి.. ఈ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. బ్రెజిల్‌లో  3లక్షల 19వేల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇరవై వేలకు పైగా మరణాలు సంభవించాయి. కాగా, లక్షా 25వేల మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
అటు స్పెయిన్‌లోనూ కరోనా కల్లోలం తగ్గలేదు. అక్కడ కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువవుతుండగా.. మరణాలు సంఖ్య ముప్పైవేలకు దగ్గరవుతోంది. యూకేలో రెండు లక్షల 54వేల మంది వైరస్ బారిన పడగా.. 36వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

అటు అమెరికాలో కరోనా కల్లోలం ఆగడం లేదు. అగ్రరాజ్యంలో మరణాల సంఖ్య లక్షకు చేరువ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఆ దేశంలో మొత్తంగా 16 లక్షల మందికి పైగా వైరస్‌ బారిన పడగా... దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు నాలుగు లక్షల మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే, రోజూవారీ నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గడం.. అమెరికాకు కాస్త ఊరట కల్పిస్తోంది...రష్యాలోనూ కరోనా వీరవిహారం చేస్తోంది.. అక్కడ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటిపోయింది. ఇప్పటి వరకూ మూడువేల మందికి పైగా వైరస్‌ బలికాగా... దాదాపు లక్షమంది కోలుకున్నారు.