సిమ్ తో పనిలేకుండానే కాల్స్

సిమ్ తో పనిలేకుండానే కాల్స్

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు చేరువయ్యే పనిలో పడింది. దేశీయ తొలి ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసును కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా  చేతుల మీదుగా ఆవిష్కరింపచేసింది. ఈ సర్వీసులతో బీఎస్ఎన్ఎల్ మొబైల్‌ యాప్‌ ద్వారా భారత్‌లోని ఏ టెలిఫోన్‌ నెంబర్‌కైనా డయల్‌ చేసుకునేలా వీలు ఉంది. ఇందుకోసం వింగ్స్ అనే  మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

సిమ్‌ లేకుండా కాల్స్‌ చేసుకునేలా యూజర్లకు వీలుకల్పిస్తూ.. ఇంటర్నెట్‌ టెలిఫోనీ సర్వీసులు అందుబాటులోకి తెచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను కేంద్రమంత్రి అభినందించారు. తమ కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వై-ఫై, మరే ఇతర సర్వీసు ప్రొవైడర్ ద్వారా అయినా ఇతర నెట్‌వర్క్‌కు కాల్స్‌ చేసుకోవచ్చు

మామూలు కాల్స్‌కు ఏ మాదిరి ఛార్జీలు అమలవుతున్నాయో అవే ఛార్జీలను టెలికాం ఆపరేటర్లు విధించాలని కూడా ఆదేశించింది. ఈ సర్వీసులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఈ వారంలో ప్రారంభమై, జూలై 25 నుంచి యాక్టివేట్‌ అవుతాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది.