నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమిస్తున్నాం

 నదుల అనుసంధానంతో నీటి కొరతను అధిగమిస్తున్నాం

కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం జలాశయం వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొని, సున్నిపెంట వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం సున్నిపెంటలో జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ, నదుల అను సంధానంలో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేస్తున్నాం. కృష్ణా నదిపై నాగార్జున సాగర్‌ తర్వాత శ్రీశైలం జలాశయం నిర్మితమైంది. రాయలసీమలో నీళ్ల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ఈ ప్రాంతానికి నీళ్లివ్వాలని మొదట నిర్ణయించింది ఎన్టీఆరే. సమైక్యాంధ్రప్రదేశ్‌లో నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాకు ఎక్కువ నిధులు కేటాయించా. ఆంధ్రప్రదేశ్‌ రైతు రాష్ట్రంగా మారేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ప్రతి ఒక్క రైతుకూ నీరిచ్చేంత వరకు నేను జలదీక్ష విరమించనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.