పోలవరానికి మీ పూర్తి సహకారం కావాలి...

పోలవరానికి మీ పూర్తి సహకారం కావాలి...

సత్వరమే పోలవరం ప్రాజెక్టును నిర్మించేందుకు మీ పూర్తి సహకారం కావాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలరవం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చిన నితిన్ గడ్కరీకి దగ్గరుండి పనులను చూయించిన చంద్రబాబు... అనంతరం మాట్లాడుతూ... రూ.57,940 కోట్లు సవరించిన అంచనాలు ఆమోదించాల్సి ఉందన్నారు. డయాఫ్రూమ్ వాల్, జెట్ గ్రౌటింగ్ పూర్తి అయ్యాయని... కుడి కాల్వ 90 శాతం పూర్తి చేశామని, ఎడమ కాలువ పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. కాంక్రీట్ 26 లక్షల క్యూబిక్ మీటర్లు వేస్తే... కాపర్ డ్యామ్, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ చేయాల్సి ఉందన్నారు. 

పోలవరానికి నిధులు విడుదల చేయాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు... ఇప్పటికీ ఖర్చు చేసిన రూ. 2,200 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందన్న ఏపీ సీఎం... పోలవరం ప్రాజెక్టుకు సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరారు. మొదటి డీపీఆర్ ప్రకారం రూ. 461 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. తాను 26 సార్లు నేరుగా పోలవరం ప్రాజెక్టుకు వచ్చానని వెల్లడించారు చంద్రబాబు... 66 సార్లు పోలవరంపై సమీక్ష నిర్వహించానన్నారు.