నేడు పోచారానికి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇవాళ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి వెళ్లనున్నారు. మాతృవియోగంతో పుట్టెడు దుఖంలో ఉన్న శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు కేసీఆర్. కాగా, స్పీకర్ పోచారం తల్లి పాపవ్వ(107) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందారు... బుధవారం ఆమె స్వగ్రామమైన పోచారంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనివార్య కారణాలతో నిన్న అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సీఎం కేసీఆర్... స్పీకర్ పోచారంను ఫోన్లో పరామర్శించారు. ఇవాళ నేరుగా పోచారం వెళ్లి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)